'రాజా' సినిమాకి 'రౌడీ' గెస్ట్‌.!

మరిన్ని వార్తలు

మాస్‌ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న 'డిస్కోరాజా' సినిమా విడుదలకు దగ్గరవుతోంది. జనవరి 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని భారీ ఎత్తున నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కి హైద్రాబాద్‌ ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదిక కానుంది. ఈ నెల 19న జరగబోయే ఈ వేడుకకు యూత్‌ క్రేజీ స్టార్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారనీ తాజా సమాచారం. వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన 'డిస్కో రాజా' పోస్టర్లు ఫ్యాన్స్‌లో ఆసక్తిని క్రియేట్‌ చేశాయి.

 

టీజర్‌ 1, టీజర్‌ 2 అంటూ రెండు టీజర్స్‌ రిలీజ్‌ చేశారు. రెండూ విభిన్నమైన టీజర్లే. అయితే, 'డిస్కోరాజా' కథ ఎలా ఉండబోతోందనే అంశం ఈ రెండు టీజర్ల ద్వారా రివీల్‌ కాలేదు. ఇక త్వరలో విడుదల కాబోయే ట్రైలర్‌ ద్వారా అయినా కథను రివీల్‌ చేసే ప్రయత్నం చేస్తారేమో చూడాలి. డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న పాత్రల్లో రవితేజ ఈ సినిమాలో కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే, ఆ పాత్రలేమీ రివీల్‌ కాలేదింతవరకూ. 19న రిలీజ్‌ కాబోయే ట్రైలర్‌లో అయినా ఫ్యాన్స్‌ ఆసక్తిని కొంతైనా తీరుస్తారేమో 'డిస్కోరాజా' టీమ్‌ చూడాలి మరి. తమన్‌ నేపథ్య సంగీతంలో ఈ సినిమా రూపొందింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS