ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తరవాత చేయబోయే సినిమాలపై విజయ్‌కి ఓ క్లారిటీ వచ్చింది. సుకుమార్ తో ఓ సినిమా ఇటీవల ఓకే అయ్యింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 2022లో ఈ సినిమా పట్టాలెక్కుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈలోగా ఈసినిమాకి సంబంధించిన కథా నేపథ్యం గురించి లీకేజీలు మొదలయ్యాయి. విజయ్ దేవరకొండ కోసం సుకుమార్ ఓ దేశభక్తి కథ రాసుకున్నాడట.
ఈ సినిమా మొత్తం ఇండో - పాక్ వార్ నేపథ్యంలో సాగుతుందని, విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఓ జవాన్ గా నటించనున్నాడని తెలుస్తోంది. దేశభక్తి నేపథ్యంలో ఓ అందమైన ప్రేమకథని సుకుమార్ మేళవించాడని, ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకూ చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. విజయ్ సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా వైపు చూస్తున్నాయి. సుకుమార్ కూడా పాన్ ఇండియా ఇమేజ్ నే దృష్టిలో ఉంచుకుని ఈ కథ రాశాడట. దేశభక్తి కథలంటే... వాటికి మైలేజీ ఎక్కువ. అందుకే ఈ బ్యాక్ డ్రాప్ ని సుకుమార్ సెట్ చేశాడని సమాచారం.