విజయ్ దేవరకొండ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. తన అవయవాలు దానం చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. హైదరాబాద్ లో ఇటీవల లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రాముఖ్యత తెలియజేస్తూ పేస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అవయవదానం ఎంత గొప్పదో తెలియజేస్తూ తాను కూడా ఆ పని చేస్తున్నట్లు ప్రకటించాడు.
''చనిపోయిన తరువాత చాలా మంది తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావడం గొప్ప విషయం. నా మరణానంతరం నా అవయవాలన్నీ దానం చేయడానికి ముందుకొచ్చాను.
అలా చేయడం వల్ల ఇతరుల ఆనందంలో భాగం కావడం వారితో మళ్లీ ఈ లోకంలో వుండటం చాలా ఆనందాన్నిస్తుంది. దక్షిణాసియాలో ఎక్కువగా అవయవదానం కోసం ముందుకు రావడం లేదు. ప్రతీ ఒక్కరూ అవయవదానం కోసం ప్రతిష్ఞ చేయాలి'' అని కోరాడు విజయ్.