జెట్‌ స్పీడులో రౌడీ!

By Inkmantra - March 09, 2020 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

రౌడీ విజయ్‌ దేవరకొండ తాజా చిత్రం ‘ఫైటర్‌’ అప్పుడే 40 రోజుల షూటింగ్‌ పార్ట్‌ కంప్లీట్‌ చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు కన్‌ఫామ్‌ చేశారు. ప్యాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌తో కలిసి, ఛార్మీ, పూరీ జగన్నాధ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్‌తో కలిసి అనన్యా రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్న స్టిల్స్‌ ఈ మధ్య నెట్టింట్లో హల్‌చల్‌ చేశాయి. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమాతోనే బాలీవుడ్‌లో అడుగు పెడుతున్నాడు విజయ్‌ దేవరకొండ. అలాగే అనన్యకు ఇదే తొలి సౌత్‌ మూవీ కానుంది. మరోవైపు నెక్స్‌ట్‌ షెడ్యూల్‌ కోసం ఓ భారీ సెట్‌ని ఏర్పాటు చేసే యోచనలో పూరీ అండ్‌ టీమ్‌ ఉందట. అయితే, అది హైద్రాబాద్‌లోనా.? లేక ముంబయ్‌లోనేనా.? అనేది చూడాల్సి ఉంది. ఈ 40 రోజుల పాటు జరిగిన షెడ్యూల్‌కి సంబంధించి అవుట్‌ పుట్‌ సూపర్బ్‌గా వచ్చిందట. ఇదే జోరులో సెకండ్‌ షెడ్యూల్‌ పార్ట్‌ కూడా కంప్లీట్‌ చేసేయనున్నారట పూరీ అండ్‌ టీమ్‌. ఈ స్పీడు చూస్తుంటే, సమ్మర్‌కే బాక్సాఫీస్‌ ఫైట్‌కి మన ‘ఫైటర్‌’ రెడీ అయ్యేలా ఉన్నాడుగా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS