రాహుల్ దేవ్.. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రతినాయక పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. 51 ఏళ్ల వయసున్న ఈయన ప్రేమ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. 33 ఏళ్ల యువతితో రాహుల్ దేవ్ ప్రేమలో ఉన్నాడు. గత కొన్నేళ్లుగా ఆమెతో డేటింగ్ చేస్తున్నాడు కూడా. అయితే, ఈ వయసులో ఇదేం పని? అన్నట్లుగా ఆయన్ని కొందరు ప్రశ్నిస్తున్నారట అందుకు తాజాగా ఆయన రెస్పాoడ్ అయ్యారు ఈ రోజుల్లో ప్రేమకు ఇదేమి పెద్ద ఇష్యూ కాదు.
1998లో రాహుల్ దేవ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక బాబు పుట్టాడు. బాబుకు 11 ఏళ్ల వయసు ఉండగా, ఆయన భార్య క్యాన్సర్‌తో చనిపోయింది. చివరి స్టేజ్‌లో తన కెరీర్‌ని పక్కన పెట్టేసి మరీ, రాహుల్ తన భార్యను దగ్గరుండి చూసుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తూ ఆమె మరణించింది.
అయితే, ఆ తర్వాత చాన్నాళ్లకు బాలీవుడ్ నటి ముగ్దా గాడ్సేతో రాహుల్ దేవ్‌కి పరిచయం ఏర్పడిరది. పరిచయం కాస్తా స్నేహంగా, స్నేహం ప్రేమగా మారడంతో వీరిద్దరి మధ్యా చనువు పెరిగింది. ఇరు కుటుంబ సభ్యులూ వీరి ప్రేమను సమ్మతించడంతో గత కొన్నాళ్లుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. అయినా, ఆయా కుటుంబ సభ్యులకు (రాహుల్ కొడుకుతో సహా) లేని ఇబ్బంది ఈ గుసగుసదారులకు ఎందుకు.? సహజీవనం, రెండో వివాహం, వయసు తేడా.. ఇలా ఇవన్నీ చాలా చాలా సర్వసాధారణ విషయాలు. సో మన విలన్‌గారి ప్రేమను తప్పు పట్టాల్సిన పని లేదన్నది చాలా మంది అభిప్రాయం. మీరేమంటారు.