యంగ్ హీరో విజయ్ దేవరకొండ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. స్వల్పగాయాలతో బయటపడ్డాడు. విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం 'డియర్ కామ్రెడ్' షూటింగ్ ప్రస్తుతం కాకినాడలో జరుగుతోంది. ఓ రైల్వే స్టేషన్ నేపథ్యంలో కీలక సన్నివేశం తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగా.. ఫ్లాట్ ఫామ్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి.. రైలు అందుకునే సీన్ విజయ్ దేవరకొండపై చిత్రీకరించాలి.
రైలుని అందుకునే ప్రయత్నంలో విజయ్ జారి పడ్డాడు. కాస్తలో ఉంటే.. ఫ్లాట్ ఫామ్‌కీ, రైలుకి మధ్య విజయ్ నలిగిపోయేవాడే. కానీ... అదృష్టవశాత్తూ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన అనంతరం.. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేసింది చిత్రబృందం. కాలుకి, చేతికి అయిన గాయాలను.. సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు విజయ్. 'జీవితంలో ఏదీ సులభంగా అందదు' అంటూ ఓ సందేశం కూడా అభిమానులకు చేరవేశాడు. గెట్ వెల్ సూన్... విజయ్ దేవరకొండ.