నేషనల్ క్రష్ రష్మిక యానిమల్ హిట్ తో మంచి జోరు మీద ఉంది. ఇప్పుడు కూడా రష్మిక, విజయ్ ఫాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. కారణం రష్మికకి ఒక అరుదైన గౌరవం దక్కింది. ఈ గౌరవానికి మురిసిన రౌడీ హీరో సోషల్ మీడియా వేదికగా పొగడ్తల వర్షం కురిపించాడు. పుష్ప మూవీతో రష్మికకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు యానిమల్ మూవీతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొంది, నటన పరంగా కూడా క్రిటిక్స్ తో భేష్ అనిపించుకుంది. బాలీవుడ్ రాజకీయాల కారణంగా ఫిలిం ఫేర్ కి నామినేట్ అవలేదని డిసప్పాయింట్ అవుతున్న ఫాన్స్ కి, రష్మిక గుడ్ న్యూస్ షేర్ చేసింది.
రష్మిక వరల్డ్ టాప్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా వెర్షన్ కవర్ పేజీ పై మెరిసింది. ప్రస్తుతం ఇండియాలో టాప్ పొజిషన్ లో ఉన్న యువ వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు, స్టార్స్ కి సంబంధించి ఫోర్బ్స్ ఇండియా ఓ ప్రత్యేక ఆర్టికల్ ని ప్రచురించింది. ఈ ఆర్టికల్ లో సినిమా ఇండస్ట్రీ నుంచి రష్మిక స్థానం దక్కించుకున్నారు. ఈ ఆర్టికల్ కి సంబంధించిన కవర్ పేజీని రష్మిక తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి తన సంతోషాన్ని తెలియజేసారు. ఈ పోస్టు చూసిన ప్రతి ఒక్కరు రష్మికకు విషెస్ చెప్తున్నారు.
ఈక్రమంలోనే విజయ్ దేవరకొండ కూడా విషెస్ చెప్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశాడు. తన ఇనిస్టాలో రష్మిక పోస్టుని షేర్ చేస్తూ, “నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎక్కడి నుంచో ఇక్కడి వరకు చేరుకున్నావు. ఇలాగే మరింత స్థాయికి ఎదగాలని, అందరికి స్ఫూర్తి కావాలని కోరుకుంటున్నాను” అంటూ విజయ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ తో రష్మిక విజయ్ అనుబంధం మరోసారి బయట పడింది.