విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు ముందు వరకు బాగానే వున్నాడు. కానీ అర్జున్ రెడ్డి సక్సెస్ తర్వాత ఒక రౌడీ ట్యాగ్ తగిలించుకున్నాడు. ఆ సినిమా క్యారెక్టర్ ఇచ్చిన ఎఫెక్ట్ ఏమో కానీ విజయ్ ప్రవర్తనలో తేడా వచ్చింది. అతివాదం కనిపించింది. విజయ్ ఇచ్చే స్టేట్మెంట్లు కూడా ఎదో ఒక సెక్షన్ ని హార్ట్ చేసినట్లే వుంటుంది. ఇదంతా ఆయన వ్యక్తిత్వం అని వదిలేద్దాం. అయితే సినిమాల విషయంలో విజయ్ మాటలు కోటలు దాటుతున్నాయి.
లైగర్ విషయంలోనే తీసుకోండి. దేశం మొత్తం వాట్ లగా దేంగే , ఊపేస్తాం, తుఫాను సృష్టిస్తాం ఇలా మాటలు చెప్పారు. అయితే ఇవన్నీ ప్రగల్భాలుగానే మిలిగిపొయాయి. లైగర్ కోసం చాలా కష్టపడ్డాడు విజయ్. దాన్ని ఎవరూ కాదనరు. కానీ లైగర్ డిజాస్టర్ కి విజయ్ కూడా ఒక కారణం. లేనిపోనీ హైప్ ని క్రియేట్ చేశాడు. విజయ్ మాటలు వింటే ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ అనే భ్రమ కలిగింది, అదే భ్రమతో థియేటర్లో అడుగుపెడితే బొమ్మ కనబడింది.
ఇప్పుడు విజయ్ తన పద్దతి మార్చుకోవాలి. ఓవర్ హైప్ క్రియేట్ చేసే మాటలు మాట్లాడ కూడదు. ఇలాంటి మాటలే చెప్పుకుంటూపొతే భవిష్యత్ లో విజయ్ నిజాలు చెప్పినా ఎవరూ నమ్మరు.