టాలీవుడ్‌లో యంగ్ సెన్సేషన్‌గా అతి తక్కువ సమయంలోనే చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ త్వరలో 'నోటా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోన్న సంగతి తెల్సిందే. ఈ వారమే ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇది ఓ పొలిటికల్ థ్రిల్లర్. స్వామీజీలమీదా, ప్రస్తుత రాజకీయ వ్యవస్థపైనా సినిమాలో సెటైర్లు పడ్డాయి. దాంతో సినిమా సహజంగానే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
తెలంగాణలో ఎన్నికల రాజకీయం, ఆంధ్రప్రదేశ్‌లో వేడెక్కిన రాజకీయ వాతావరణం నేపథ్యంలో 'నోటా' ఎవర్ని ఉద్దేశించి తీసిన సినిమా? అనే చర్చ జరుగుతోంది. విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ముందుకొస్తున్నప్పుడు, 'జెన్యూనిటీ' అనే మాట ఎక్కువగా ఆయన నోట విన్పిస్తోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌లో ఆ జెన్యూనిటీ తనకు నచ్చిందని చెబుతున్నాడాయన. ఆఫ్ ది కెమెరా కూడా అభివృద్ధి కోసం, ఇతర ముఖ్య అంశాల కోసం ఆయన పడే తపన తనకు బాగా నచ్చిందనీ అంటున్నాడు విజయ్ దేవరకొండ.
అయితే 'స్నేహం' అనేంతటి గొప్ప మాటల్ని తాను ఉపయోగించలేననీ, ఎందుకంటే తాను కేటీఆర్‌తో పోల్చితే చాలా విషయాల్లో చాలా చిన్నవాడిననీ చెప్పాడీ యంగ్ హీరో. అయినప్పటికీ కూడా తెలంగాణలో ఎన్నికల సందర్భంగా విజయ్ దేవరకొండ ఎఫెక్ట్, అధికార పార్టీకి అనుకూలంగా వుండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే 'నోటా' ప్రమోషన్‌లో భాగంగా 'పబ్లిక్ మీటింగ్' వంటి పదాల్ని ఉపయోగిస్తూ, సినిమాకి క్రేజ్ పెంచేస్తూ వచ్చారు చిత్ర నిర్మాత. ఆల్రెడీ 60 కోట్ల షేర్‌ని 'గీత గోవిందం'తో కొల్లగొట్టిన విజయ్, 'నోటా' సినిమాతో తొలిసారిగా 100 కోట్ల క్లబ్‌లోకి (షేర్) పరంగా చేసే అవకాశాల్ని కొట్టి పారేయలేం.