'రౌడీ' రాజకీయం మొదలైంది.!

మరిన్ని వార్తలు

'సెన్సేషనల్‌ స్టార్‌' అని అందరూ పొగిడేస్తుంటే, 'రౌడీస్టార్‌' అంటూ తనను తాను ముద్దుగా ప్రమోట్‌ చేసుకుంటున్నాడు విజయ్‌ దేవరకొండ. 'గీత గోవిందం' చిత్రంతో విజయ్‌ దేవరకొండ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆటోమెటిగ్గా మనోడి రెమ్యునరేషన్‌ రేంజ్‌ కూడా దాదాపు సీనియర్‌ స్టార్స్‌ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఎంతైనా 100 కోట్ల గ్రాస్‌ యంగ్‌ హీరో కదా. 

ఇకపోతే ఈ రోజు సాయంత్రం విజయ్‌ దేవరకొండ నటిస్తున్న నోటా ట్రైలర్‌ విడుదల కానుంది. ఈ విషయాన్ని ఊరికే ప్రకటించలేదు మన సెన్సేషనల్‌ స్టార్‌. సారీ రౌడీ స్టార్‌. ఓ స్నీక్‌ పీక్‌ అంటూ శాంపిల్‌కి ఓ వీడియో విడుదల చేశారు. అందులో విజయ్‌ దేవరకొండను చూపించిన విధానానికి యూత్‌ ఊగిపోతున్నారు అప్పుడే. ది రౌడీ, ది పొలిటీషియన్‌ అంటూ వస్తున్న క్యాప్షన్స్‌తో ఈ సారి కూడా మనోడు ఏదో మ్యాజిక్‌ చేసేలానే ఉన్నాడనిపిస్తోంది. ఖచ్చితంగా ఇదేదో సెన్సేషనల్‌ మూవీనే అనిపిస్తోంది. 

అసలే పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో పొలిటికల్‌ ఫీవర్‌ ఎక్కువగా ఉన్న టైమ్‌ ఇది. ఈ తరుణంలో విజయ్‌ దేవరకొండ 'నోటా'తో ఎలాంటి సంచలనాలకు శ్రీకారం చుడతాడో చూడాలిక. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటించిన 'భరత్‌ అనే నేను' చిత్రం తర్వాత ఆ రేంజ్‌ కాకపోయినా, విజయ్‌దేవరకొండ స్టార్‌డమ్‌ పరంగా ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమా ఇది. 

సో చూడాలి మరి విమర్శలకు ఆస్కారమవుతుందా? లేక సంచలనాలకు వేదిక అవుతుందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS