సునీల్‌ బౌన్స్‌బ్యాక్‌ నిజమేనా?

మరిన్ని వార్తలు

భీమవరం బుల్లోడు సునీల్‌ కమెడియన్‌గా తన టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోగా 'అందాల రాముడు' చిత్రంతో తెరంగేట్రం చేశాడు. 'మర్యాద రామన్న' చిత్రం హీరోగా సునీల్‌ కెరీర్‌ని టర్న్‌ చేసింది. అయితే ప్రస్తుతం హీరోగా సునీల్‌ బోర్‌ కొట్టించేశాడు. 

హీరోయిజంలో మూస కథలను ఎంచుకుంటూ ఆడియన్స్‌కి తనలోని టైమింగ్‌ని మర్చిపోయేలా చేశాడు. దాంతో వరుస ఫ్లాపులు అంటకట్టేశారు సునీల్‌కి అభిమానులు. అందుకే సునీల్‌ సడెన్‌గా ట్రాక్‌ మార్చేశాడు. మళ్లీ కమెడియన్‌ అవతారమెత్తాడు. హీరోగా నటించిన తర్వాత పూర్తి స్థాయిలో సునీల్‌ నుండి వస్తున్న కామెడీ చిత్రం 'సిల్లీ ఫెలోస్‌' అనే చెప్పాలి. 

సునీల్‌తో పాటు, అల్లరి నరేష్‌ కూడా ఈ సినిమాలో నవ్వులు పూయించేందుకు సిద్ధపడుతున్నాడు. ఈ ఇద్దరికీ ఈ సినిమా చాలా చాలా కీలకమైనది. ఎందుకంటే ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది. అల్లరోడికి 'సుడిగాడు' సినిమాతో కెరీర్‌ బెస్ట్‌ హిట్‌ ఇచ్చిన భీమినేని శ్రీనివాస్‌ ఈ సినిమాని తెరకెక్కించారు. రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ప్రమోషన్స్‌ జోరు విపరీతంగా పెంచేశారు. అయితే సక్సెస్‌ ఎలా ఉంటుందనేది విడుదలైతే కానీ తెలీదు. 

మరోవైపు ఎన్టీఆర్‌ నటిస్తున్న 'అరవింద సమేత' చిత్రంలో సునీల్‌ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్నాడు. అయితే అది కామెడీ రోల్‌నా? లేక ఇంపార్టెంట్‌ రోల్‌ అంటే సపోర్టింగ్‌ క్యారెక్టర్‌నా? అనేది తెలియాలంటే దసరా వరకూ ఆగాల్సిందే.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS