విజయ్‌దేవరకొండ మళ్లీ వచ్చేస్తున్నాడు.!

మరిన్ని వార్తలు

సంచలన హీరో విజయ్‌దేవరకొండ ఇటీవల 'గీత గోవిందం' చిత్రంతో వచ్చి ఎంత రచ్చ రచ్చ చేశాడో, చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల ప్రశంసలతో పాటు, కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌నీ షేక్‌ చేసేస్తున్నాడీ యంగ్‌ హీరో. 100 కోట్ల గ్రాస్‌ కొల్లగొట్టి, తన స్టామినా ఏంటో ప్రూవ్‌ చేసుకున్నాడు ఈ సినిమాతో. 

ఇప్పుడు 'నోటా' సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు విడుదల కానుందని చిత్రయూనిట్‌ ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఆ పోస్టర్‌లో విజయ్‌ దేవరకొండ క్లాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. వెనక నాజర్‌, సత్యరాజ్‌ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన ముద్దుగుమ్మ మెహ్రీన్‌ కౌర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తొలి సినిమా నుండీ సెన్సేషన్‌ సృష్టిస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. 

'పెళ్లిచూపులు', 'అర్జున్‌రెడ్డి', 'గీత గోవిందం' ఇలా చెప్పుకుంటూ పోతే, రేపు 'నోటా'తో కూడా మరో హిట్‌ కొట్టేసేలానే ఉన్నాడు. అలా ఉందిప్పుడు విజయ్‌ దేవరకొండ ఫాలోయింగ్‌. యూత్‌లో పిచ్చ క్రేజ్‌ సంపాదించేశాడు. ఆయన ఆటిట్యూడ్‌కి యూత్‌ ఫిదా అయిపోతోంది. ముఖ్యంగా అమ్మాయిలకు లవర్‌బోయ్‌గా మారిపోయాడు. సినిమా ప్రమోషన్స్‌లో కూడా కొత్తదనం చూపిస్తున్నాడు. ఆ కొత్తదనంతోనే అందర్నీ కట్టిపడేస్తున్నాడు. 

ఇప్పుడు 'నోటా'తో విజయ్‌ ఏం మాయ చేస్తాడో చూడాలి మరి. ఆనంద్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS