సహజంగా హిట్ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడేందుకు హీరోలు, అభిమానులు ఆసక్తి చూపిస్తారు. అదే ఒక ఫ్లాప్ సినిమా గురించి మాట్లాడేందుకు వెనకడుగు వేస్తారు. ఫ్లాప్ అయిన సినిమాలకు యానివర్సరీ అయినా ఇంకొకటి అయినా వారు దాదాపుగా స్పందించరు. విజయ్ దేవరకొండ మాత్రం 'డియర్ కామ్రేడ్' ఏడాది అయిన సందర్భంగా ఒక ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేస్తూ తను మిగతా హీరోలకు భిన్నమని ప్రూవ్ చేసుకున్నారు.
భారీ అంచనాల నడుమ అన్ని సౌత్ ఇండియన్ భాషలలో పోయినేడాది రిలీజ్ అయిన 'డియర్ కామ్రేడ్' ప్రేక్షకులను నిరాశ పరిచింది. అన్ని భాషలలో కూడా ఫ్లాప్ గా నిలిచింది. సినిమా కాన్సెప్ట్, లీడ్ యాక్టర్ల నటనకు మంచి ప్రశంసలు దక్కాయి కానీ సినిమాకు ఓవరాల్ గా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా విజయ్ దేవరకొండ మనసుకు దగ్గరగా ఉందనే సంగతి గతంలో కూడా పలు సందర్భాల్లో తెలిపారు. తాజాగా మరోసారి ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ ఇదే సినిమాను మరొకసారి తనకు ఆఫర్ చేస్తే తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు తన మనసులో ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని కూడా వెల్లడించారు. .ఈ సినిమా రిలీజ్ సమయంలో తనకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయని, తనను అవి మార్చాయని, వాటి గురించి మరో సందర్భంలో ప్రేక్షకులతో పంచుకుంటానని తెలిపారు.
ఇక విజయ్ దేవరకొండ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే సినిమాలో నటిస్తున్నారు. కరోనా క్రైసిస్ కారణంగా ఆగిన ఈ సినిమాను త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తారని అంటున్నారు. ఈ సినిమాతో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటించేందుకు కు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా టాక్ వినిపిస్తోంది.