ప్రభాస్ సినిమాలో దేవరకొండ

మరిన్ని వార్తలు

సందీప్ వంగా తన మొదటి సినిమా అర్జున్ రెడ్డితో ప్రభంజనం సృష్టించి, సాలిడ్ హిట్ కొట్టాడు. విజయ్ దేవరకొండకి తన కెరియర్ లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే హిట్ ఇచ్చాడు. చేసినవి తక్కువ సినిమాలే కానీ సందీప్ ఇంపాక్ట్ ఇండస్ట్రీలో చాలా కనిపిస్తుంది. తన సినిమాలతో కొత్త ట్రెండ్ సెట్ చేశాడు సందీప్. అర్జున్ రెడ్డి తరవాత ఆ రేంజ్ లో యానిమల్ మూవీ తీసాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లో తిరుగులేని ముద్ర వేసుకున్నాడు సందీప్. హీరోకి మించి సందీప్ కే ఎక్కువ ప్రశంసలు, విమర్శలు వచ్చాయి. సినిమా వచ్చి ఇన్ని రోజులైనా ఇప్పటికీ ఎక్కడో దగ్గర యానిమల్ వివాదం చెలరేగుతూనే ఉంది. సందీప్ పేరు వినిపిస్తూనే ఉంది.   


ఇలాంటి కాంట్రవర్సి టాలెంటెడ్ డైరక్టర్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సందీప్ నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో చేయనున్నట్లు, 'స్పిరిట్' అనే టైటిల్ కూడా ఎప్పుడో ఫిక్స్ చేశారు. కానీ డార్లింగ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన స్పిరిట్ ఆలస్యం అయ్యేటట్టు ఉంది. ప్రభాస్ ప్రస్తుతం కల్కితో రానున్నాడు. కల్కి తరువాత రాజా సాబ్, నెక్స్ట్ సలార్ 2 , హను రాఘవపూడి సినిమాల తరవాత స్పిరిట్ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా తరవాత సలార్ 2 తెరకెక్కించనున్నారని, వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజా సాబ్ పూర్తి చేసి,  ప్రభాస్, సందీప్ వంగాతో స్పిరిట్ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. 


దీనితో స్పిరిట్ మూవీని సందీప్ పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట. అంతే కాదు ఈ మూవీ గూర్చి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. స్పిరిట్ లో ఒక ఇంపార్టెంట్ క్యారక్టర్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు తెలుస్తోంది. పాన్ వరల్డ్ సినిమాలో, సందీప్, ప్రభాస్ కాంబోలో మెరిస్తే తనకి ఇంకొంచెం ప్లస్ అవుతుందని విజయ్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. పైగా అర్జున్ రెడ్డి లాంటి హిట్ ఇచ్చిన సందీప్ కి విజయ్ నో చెప్ప లేడు కదా. విజయ్ రోల్  సర్ ప్రైజింగ్ గా ఉంటుందని అదే  సినిమాకు హైలెట్ అవుతుందని ఈ కారణం తో సందీప్ విజయ్ కి ఆఫర్ ఇచ్చినట్టు టాక్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS