టాలీవుడ్‌కి ఇప్పుడు పొలిటికల్ ఫీవర్ పట్టుకుంది. రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రాలు విరివిగా వస్తున్నాయి ఇప్పుడు.
మహేష్ బాబు నటిస్తున్న 'భరత్ అనే నేను' పొలిటికల్ స్టోరీనే. 'రంగస్థలం, ఓటర్ లాంటి సినిమాల్లోనూ రాజకీయాల ప్రస్తావన ఉంది. ఇప్పుడు ఇదే బాటలో... విజయ్ దేవరకొండ కూడా నడుస్తున్నాడు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా స్డూడియో గ్రీన్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆనంద్ శంకర్ దర్శకుడు. సోమవారం ఉదయం ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. వారసత్వ రాజకీయాల నేపథ్యంలో ఈ కథ సాగబోతోందని సమాచారం.
ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేస్తారు. తమిళ నాట ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి అక్కడి రాజకీయాలను ఈ కథలో ప్రస్తావిస్తున్నారని సమాచారం. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
త్వరలోనే టైటిల్ ఏమిటన్నది తెలుస్తుంది. ఇందులో సత్యరాజ్, విజయ్ తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారు.