సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం కాలా టీజర్ విడుదలవ్వడం అది ప్రేక్షకులని మెప్పించడం జరిగిపోయాయి. ప్రస్తుతం ఆ చిత్రం వచ్చే నెల ప్రేక్షకుల ముందుకి రానుంది. Pa. రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సమయంలో వీరి కలియకలో ఇంతకముందు వచ్చిన కబాలి చిత్రాన్ని పంపిణీ చేసిన సెల్వకుమార్ అనే వ్యక్తి వీరికి ఒక షాక్ ఇచ్చాడు. అదేంటంటే- కబాలి చిత్రం పాండిచేర్రి ప్రాంతంలో ఈయన పంపిణీ చేయడం అది కాస్త బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడడంతో ఊహించని నష్టాలని ఎదురుకున్నాడు.
కబాలి నిర్మాత అయిన కలైపులి S థాను తన డబ్బులు వెనక్కిస్తే వెంటనే ఆ అప్పు చెల్లిస్తాను అని లేని పక్షంలో ఆత్మహత్య తప్ప వేరే దిక్కు లేదని చెప్పాడు. మరి దీని పైన రజినీకాంత్ & కో స్పందన ఏంటి అనేది తెలియరాలేదు.
ఒకప్పుడు అంటే కేవలం సినీ హీరోగా ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక రాజకీయ నాయకుడు కాబట్టి కచ్చితంగా ఇతనికి సమాధానం చెప్పవలసి ఉంటుంది.