విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. `లైగర్`, `ఫైటర్` అనే టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. చివరికి `లైగర్` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు టైటిల్ ఫిక్స్ చేస్తూ.. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. సింహానికీ, పులికీ.. క్రాస్ బ్రీడ్ చేస్తే.. పుట్టే జీవిని లైగర్ అంటారు. అందుకే.. సబ్ టైటిల్ కూడా... `సాలా.. క్రాస్ బ్రీడ్` అని ఫిక్స్ చేశారు.
సింహం, పులి.. బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తుంటే, ఫ్రంట్ గ్రౌండ్ లో.. బాక్సింగ్ గ్లౌజులతో.. పంచ్‌లు విసురుతున్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది. అన్ని భాషల్లోనూ ఇదే పేరుతో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ముంబైలో కొంత భాగం తెరకెక్కించారు. త్వరలో అక్కడే కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.