`ఓ బేబీ` తరవాత... సమంత తెలుగులో కొత్త సినిమా ఒప్పుకోలేదు. ఎట్టకేలకు `శాకుంతలమ్`కి ఓకే చెప్పింది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. శకుంతల - దుశ్యంతుల ప్రణయ గాథ. పౌరాణిక చిత్రంలో నటించడం సమంతకు ఇదే తొలిసారి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పుడు గుర్రపు సవారీ శిక్షణ తీసుకుంటోంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం సమంత.. గుర్రపు స్వారీలో మెళకువలు నేర్చుకుంటోంది. ఈ సినిమాకి సమంతనే డబ్బింగ్ చెప్పుకుంటుంది.
సమంత తెలుగు బాగానే ఉంటోంది గానీ, కఠినమైన పదాల్ని పలకలేదు. అందుకే తెలుగులో సైతం.. ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటోందని తెలుస్తోంది. దుశ్యంతుడిగా నటించేది ఎవరన్నది ఇంకా తేలలేదు. ఈ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపుదిద్దాలన్నది గుణశేఖర్ ప్లాన్. అందుకే.. బాలీవుడ్ నుంచి దుశ్యంతుడిని తీసుకొస్తారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.