ఈ వారం ఎలిమినేషన్‌లో రోహిణి, ఇంటి నుండి బయటికి వెళ్లిపోతుందని చెప్పిందట శ్రీముఖి. ఈ విషయాన్ని పదే పదే అషూ ప్రస్థావించడంతో వీక్షకులకు తెలిసింది. ఈ కారణంతో శ్రీముఖిని తాను హేట్ చేస్తున్నట్లుగా అషూ అభిప్రాయపడింది. గెస్ చేయడం అనేది ఎవరికి వారికే పర్సనల్ ఇష్యూ. కానీ, ఆ వ్యక్తి ముఖం మీదే అలా చెప్పడం, ఇన్‌డైరెక్ట్‌గా ఆ వ్యక్తిని మెంటల్‌గా దెబ్బ తీయడమే అవుతుంది.
సో అది చాలా పెద్ద తప్పు.. అంటూ శ్రీముఖిని ఆషూ రెడ్డి తప్పుపట్టింది. కానీ, శ్రీముఖి గెస్ చేసినట్లుగానే రోహిణి ఈ వారం బిగ్ హౌస్ నుండి బయటికి వెళ్లాల్సి వచ్చింది. నిజానికి ఈ వారం బాబా భాస్కర్‌కి ఎక్కువ ఎడ్జ్ ఉందని భావించారంతా. కానీ, అనూహ్యంగా ఆ ఎడ్జ్ రోహిణి వైపుకి మళ్లింది. నిజానికి రోహిణిని ఇంటి సభ్యులెవరూ నామినేట్ చేయలేదు. అనుకోకుండా జరిగిన చిన్న తప్పిదం కారణంగా, బిగ్‌బాస్ ఆగ్రహానికి గురి కావడం, తద్వారా వీక్షకుల నుండి ఫైనల్ డెసిషన్ అందుకోవడం, ఊహించని రీతిలో హౌస్ నుండి వైదొలగడం చకచకా జరిగిపోయాయి.
ఒక్కోసారి మనకు తెలియకుండానే జరిగే చిన్న తప్పులు ఎంత పెద్ద పరిణామాలకు కారణమవుతాయో, తాజాగా బిగ్‌హౌస్‌లోని పరిణామాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే, శివజ్యోతి కారణంగానే రోహిణి అనవరసరంగా హౌస్ నుండి బయటికి వెళ్లిపోయిందనే వాదన బయట బలంగా వినిపిస్తోంది.