రౌడీ కోసం టైటిల్ రెడీ

By iQlikMovies - May 18, 2020 - 17:28 PM IST

మరిన్ని వార్తలు

విజ‌య్ దేవ‌ర‌కొండ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. మార్ష‌ల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే క‌థ‌. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా కోసం `ఫైట‌ర్‌` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. త‌మిళంలో ఈ పేరుతో ఇప్పటికే ఓ సినిమా రూపొందుతోంది. మ‌ల‌యాళంలోనూ టైటిల్ స‌మ‌స్య‌గా ఉంది. అన్ని భాష‌ల్లోనూ ఒకే టైటిల్ పెట్టాలంటే.. ఇప్పుడు టైటిల్ మార్చాల్సిన అవ‌స‌రం ఉంది. దాంతో `లైగ‌ర్‌` అనే మ‌రో టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే... ఈ రెండు టైటిళ్లూ కాకుండా మ‌రో కొత్త టైటిల్ దొరికింద‌ట‌. త్వ‌ర‌లోనే ఆ టైటిల్‌ని అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.

 

చిత్ర నిర్మాత ఛార్మి ఈ విష‌యంపై మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం ఫైట‌ర్‌, లైగ‌ర్ అనే రెండు టైటిళ్లు ప్ర‌చారంలో ఉన్నాయి. కానీ అవేం కాదు. ఓ కొత్త టైటిల్ ని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం. టైటిల్ మాత్రం అదిరిపోతుంది'' అని ఊరించింది. మ‌రి ఆ టైటిల్ ఏమిటో? ఎప్పుడు ప్ర‌క‌టిస్తారో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS