'అర్జున్‌రెడ్డి' రౌడీక్లబ్‌లోకి ఎంటర్‌ అవుతారా?

By iQlikMovies - June 13, 2018 - 18:34 PM IST

మరిన్ని వార్తలు

విజయ్‌ దేవరకొండ ఓ ప్రత్యేకమైన హీరో. ఓ డిఫరెంట్‌ ఆటిట్యూడ్‌తో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేశాడు. రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయాడు. తొలి సినిమా నుండీ సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ ఏదో విషయం ఉన్న కుర్రోడు. 'పెళ్లి చూపులు'తో స్టార్‌డమ్‌ సంపాదించిన ఈ తెలంగాణ కుర్రోడు 'అర్జున్‌రెడ్డి'తో ఆకాశమంత ఎదిగిపోయాడు. 

'అర్జున్‌రెడ్డి' సినిమా విడుదలై ఏడాది గడుస్తున్నా, మనోడు ఆ ఇంపాక్ట్‌ని జనంలోంచి తీసేయలేకపోతున్నాడు. ఇటీవలే విజయ్‌ దేవరకొండ నటించిన 'మహానటి' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో మెయిన్‌ లీడ్‌ కీర్తిసురేష్‌ - దుల్కర్‌ సల్మాన్‌ అయినప్పటికీ, విజయ్‌ దేవరకొండ పాత్ర ప్రభావం కూడా చెప్పుకోదగ్గదే. 

ఇకపోతే, తాజాగా మనోడు తన డిఫరెంట్‌ ఆటిట్యూడ్‌తో మరోసారి ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేసే ప్రయత్నం చేశాడు. అదేంటంటే, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌కి విజయ్‌ దేవరకొండ కూడా నామినేట్‌ అయ్యాడట. ఈ అవార్డ్‌ ఫంక్షన్‌కి వెళ్లేటప్పుడు విజయ్‌ దేవరకొండ ఆ ఫంక్షన్‌కి ఓ అభిమానిని తనతోపాటు తీసుకెళ్తాడట. మరి విజయ్‌కి ఎంతో మంది అభిమానులున్నారు. ఆ అదృష్టం దక్కించుకునే ఆ లక్కీ గై ఎవరు? అంటే అందునూ మనోడు అద్దిరిపోయే ఆఫర్‌ ఇచ్చాడండోయ్‌. 

'రౌడీక్లబ్‌. ఇన్‌' పేరుతో విజయ్‌ దేవరకొండ ఓ వెబ్‌సైట్‌ని స్టార్ట్‌ చేశాడు. ఆ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి వారి వివరాలు ఇవ్వాలట. ఊరికే కాదు, ఆటిట్యూడ్‌ కూడా యాడ్‌ చేయాలి మరి. (కండిషన్స్‌ ఆల్సో అప్లై) తనను మెప్పించిన బెస్ట్‌ ఆటిట్యూడ్‌ పర్సన్‌ని సెలెక్ట్‌ చేసి, ఆ లక్కీ ఫ్యాన్‌ని తనతో ఫిల్మ్‌ఫేర్‌కి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తాడట విజయ్‌ దేవరకొండ. అదీ సంగతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS