అర్జున్ రెడ్డి... తెలుగు సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్టర్. ఈ కథ బాలీవుడ్ కి వెళ్లి.. అక్కడా కాసుల వర్షం కురిపించుకుంది. విజయ్ దేవరకొండని స్టార్ చేసింది. సందీప్ రెడ్డి వంగాని మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారింది. ఈ సినిమాతో చాలామంది జాతకాలు మారిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది. ఇది వరకే విజయ్ దేవరకొండకు. సందీప్ రెడ్డి వంగాకు అడ్వాన్సులు ఇచ్చేసింది మైత్రీ మూవీస్.
ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లోనే సినిమా చేయడానికి రెడీ అయ్యింది.నిజానికి విజయ్ కోసం వేరే దర్శకుడ్ని, సందీప్ కోసం వేరే హీరోని వెదకాలన్నది ప్లాన్. కానీ.. సందీప్ - విజయ్ దేవరకొండ కలసి పని చేయాలని నిర్ణయించుకోవడంతో... ఈ కాంబో కుదిరేసింది. కాకపోతే.. ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కకపోవొచ్చు. 2022 వరకూ.. ఇద్దరూ బిజీనే. 2022 చివర్లో ఈ సినిమా సెట్ అయి.. 2023లో విడుదల కావొచ్చు. ఎప్పుడైతే.. ఏంటి? ఈకాంబో సెట్ అవ్వడమే.. సూపర్ వార్త. సో... మరో అర్జున్‌రెడ్డి పట్టాలెక్కేంత వరకూ ఎదురు చూడక తప్పదు.