ఆ, కల్కి లాంటి విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకున్నాడు ప్రశాంత్ వర్మ. తన నుంచి ఓ సినిమా వస్తోందంటే.. కచ్చితంగా అటెన్షన్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే.. తెలుగు సినిమాకి జాంబీ జోనర్‌ని ప్రవేశ పెట్టే ప్రయత్నం చేశాడు. `జాంబీరెడ్డి` సినిమాతో. మనుషులు నర రూప రాక్షసులుగా మారిపోవడం, మెడలు కొరికి పీక్కుని తినడం హాలీవుడ్ సినిమాల్లో చూశాం. దాన్ని తెలుగులోకి తీసుకొచ్చి - ఓ కొత్త థియేటరికల్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చాడు ప్రశాంత్. ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా - వసూళ్లు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి. శుక్రవారంతో పోలిస్తే.. శనివారం వసూళ్ల హవా తగ్గింది. అయితే ఆదివారం అనూహ్యంగా విజృంభించి.. శుక్రవారానికి మించిన వసూళ్లు సాధించింది. దాంతో జాంబీరెడ్డి బ్రేక్ ఈవెన్‌కి దగ్గర పడింది.
జాంబీ రెడ్డి తొలి 3 రోజుల వసూళ్లు ఇవీ
నైజాం 1.14 cr
సీడెడ్ 0.65 cr
ఉత్తరాంధ్ర 0.38 cr
ఈస్ట్ 0.28 cr
వెస్ట్ 0.24 cr
కృష్ణా 0.31 cr
గుంటూరు 0.33 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 3.53 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.14 cr
ఓవర్సీస్ 0.18 cr
టోటల్ వరల్డ్ వైడ్ 3.85 cr (షేర్)
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకో కోటి రూపాయలు తెచ్చుకోవాలి. వచ్చేవారం `ఉప్పెన` విడుదల అవుతోంది. ఈలోగా థియేటర్లో ఉన్న సినిమా ఇదొక్కటే. సోమ, మంగళ, బుధవారాల్లోనూ ఎంతో కొంత రెవిన్యూ దక్కించుకునే వీలుంది. ఎలా చూసినా. బ్రేక్ ఈవెన్ కి దగ్గర పడిపోవడం ఖాయం.