లైగర్ తో విజయ్ దేవరకొండకి గట్టి ఫ్లాపే తగిలింది. ఆ తరవాత మొదలవ్వాల్సిన జనగణమన ఆగిపోయింది. ఖుషీ షూటింగ్ కూడా సవ్యంగా సాగడం లేదు. అయినా సరే.. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎక్కడా తగ్గడం లేదు. సినిమా సినిమాకీ పెరుగుతూనే ఉంది. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఓసినిమా చేస్తున్నాడు విజయ్. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఈ చిత్రానికి గానూ విజయ్ ఏకంగా రూ.45 కోట్ల పారితోషికం తీసుకొంటున్నట్టు టాక్.
ఈ సినిమా ద్వారా వచ్చే నాన్ థియేటరికల్ రైట్స్ (ఓటీటీ, శాటిలైట్,డిజిటల్) అన్నీ.. విజయ్ పారితోషికం కింద జమ చేయాలని నిర్ణయించుకొన్నార్ట. ఆ మొత్తం ఇంచుమించుగా రూ.45 కోట్లు ఉంటుందని టాక్. లైగర్ ఫ్లాపు తరవాత కూడా విజయ్‌కి ఇంత పారితోషికం ఇస్తున్నారంటే గ్రేటే. జెర్సీతో ఆకట్టుకొన్న గౌతమ్ తిన్ననూరి.. ఆ సినిమాని హిందీలో రీమేక్ చేసి బోల్తా కొట్టాడు. ఇప్పుడు విజయ్ కోసం ఓ పవర్ ఫుల్ పోలీస్ స్టోరీ రాసుకొన్నాడు. నిజానికి ఈ సినిమా చరణ్ తో చేయాల్సింది.చరణ్ నో చెప్పడంతో... విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చింది.