'ఫైటర్‌' కోసం రౌడీ కసరత్తులు.!

By Inkmantra - January 13, 2020 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

'ఇస్మార్ట్‌ శంకర్‌' సూపర్‌ హిట్‌ తర్వాత పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా 'ఫైటర్‌'. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ప్యాన్‌ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్‌ ఆటిట్యూడ్‌ ప్రదర్శిస్తూ, హీరోలందు తన హీరోయిజం వేరయా.. అంటూ యూత్‌లో మంచి క్రేజ్‌ దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ ఈ సినిమాలో సరికొత్త లుక్స్‌లో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు.

 

యాక్షన్‌ ప్రధానాంశంగా తెరకెక్కబోయే ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం థాయ్‌లాండ్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడట విజయ్‌ దేవరకొండ. రక రకాల మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్నాడట. ట్రెడిషనల్‌ యుద్ధ విద్యలతో పాటు, మోడ్రన్‌ యాక్షన్‌ సీక్వెన్సెస్‌నీ ఈ సినిమాలో టచ్‌ చేయనున్నాడట పూరీ జగన్నాధ్‌. అందుకే ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని విజయ్‌ దేవరకొండకు సూచించాడట. ఆ నేపథ్యంలోనే రౌడీ స్టార్‌ కసరత్తులు పూర్తి చేస్తున్నాడట. ఈ నెలాఖరులో సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది. అందుకోసం డిఫరెంట్‌గా మేకోవర్‌ అవుతున్నాడట విజయ్‌ దేవరకొండ.

 

ఇదిలా ఉంటే, విజయ్‌ నటించిన 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. లవర్స్‌డే సందర్భంగా ఈ లవబుల్‌ ఎంటర్‌టైనర్‌ని ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేయనున్నారు. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రాశీఖన్నా, కేథరీన్‌, ఐశ్వర్యా రాజేష్‌, ఇసాబెల్లె హీరోయిన్లుగా ఈ సినిమా రూపొందింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS