కేవలం 'ఫస్ట్ లుక్' కె 130 కోట్ల బిజినెస్ ఆ!

By Madhukishore - January 13, 2020 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ల సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొన్న తలైవర్ రజినీకాంత్ 'దర్బార్' చిత్రానికి ఇతర భాష మరియు డిజిటల్ హక్కులను కలుపుకొని మొత్తంగా 200 కోట్ల బిజినెస్ చేసి రజిని దమ్మెంటో చూపించింది.

 

ఇప్పుడు అదే రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ తలపతి విజయ్ తదుపరి చిత్రం 'మాస్టర్' కు జరిగింది. ఇతర భాష హక్కులు, డిజిటల్ మరియు శ్యాటిలైట్ హక్కులు కాకుండా కేవలం థియేటర్ రైట్స్ మాత్రమే 137 కోట్ల బిజినెస్ చేయడం  మాములు విషయం కాదు. తమిళనాడు లో 78 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.9.5 కోట్లు, కర్ణాటకలో రూ.8.5 కోట్లు, కేరళలో రూ.7.5 కోట్లు మరియు ఓవర్సీస్ లో రూ.33.5 కోట్ల బిజినెస్ జరిగింది. దీనికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ చిత్ర యూనిట్ సోషల్ మీడియా లో ప్రకటించారు.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

We are glad to announce the distributors list of #Master

A post shared by Lokesh Kanagaraj (@dir_lokeshkanagaraj) on

అయితే ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మాత్రమే విడుదలయ్యింది.. దీనికే ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందంటే ఇక టీజర్ ట్రైలర్ విడుదలయ్యాక మిగితా బిజినెస్ ఇంకో 50...60 కోట్లు చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS