విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ల పాన్ ఇండియా మూవీ ''లైగర్' ఆగస్ట్ 25న విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో 'లైగర్’ ఫ్యాన్‌డమ్ టూర్ ని వరంగల్ కాజీపేటలో నిర్వహించారు. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ , వరంగల్ ఎంపీ పసుమూరి దయాకర్, ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఈ ఈవెంట్ లో హీరోయిన్ అనన్య తెలుగు మాటలు ఆకట్టుకున్నాయి. సినిమా యూనిట్ అంతా 'వాట్ లగా దేంగే. ఆగ్ లగా దేంగే' అని లైగర్ గురించి హిందీలో మాట్లాడితే.. అనన్య మాత్రం తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించింది.
''నా పేరు అనన్య పాండే. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. విజయ్ దేవరకొండ నా బుజ్జి కన్నా. ఆగస్ట్ 25న లైగర్ సినిమా థియేటర్ లో పగిలిపోద్ది. లైగర్ ఫుల్ మాస్ కమర్షియల్ సినిమా. దింపుతున్నాం. మజా వస్తది'అంటూ ముద్దుముద్దుగా తెలుగు పలుకులు పలికింది. స్టేజ్ పై వున్న యాంకర్ సుమ కూడా అనన్య మాటలకు ముచ్చటపడిపోయింది. ఇంతకీ అనన్యకి తెలుగు ఎవరు నేర్పారో తెలుసా ? విజయ్ దేవరకొండనే. 'నా బుజ్జికన్నా విజయ్ దేవరకొండ తెలుగు నేర్పారు'' అని స్వయంగా చెప్పింది అనన్య.