Karthikeya 2 Review: కార్తికేయ-2 మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి
దర్శకత్వం : చందూ మొండేటి
నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, టి జి విశ్వ ప్రసాద్
సంగీత దర్శకుడు: కాలభైరవ
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటర్: కార్తీక్ ఘట్టమనేని


రేటింగ్ : 3/5


నిఖిల్ ఖాతాలో వున్న విజయాల్లో కార్తికేయ ఒకటి. 2014లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతోనే చందూ మొండేటి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇప్పుడు అదే కాంబినేషన్ లో కార్తికేయ-2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ ఆసక్తిని పెంచింది. విజువల్ ఎఫెక్ట్స్ రిచ్ గా కనిపించాయి. అలాగే చరిత్ర, ఇతిహాసాల నేపథ్యంలో కథ కావడం కూడా ఆసక్తిని రేకెత్తించే అంశమే. అయితే టాలీవుడ్ కి సీక్వెల్స్ అచ్చిరాలేదనే సెంటిమెంట్ ఒకటుంది. మ‌రి ఆ సెంటిమెంట్ ని కార్తికేయ-2 అధిగమించిందా? చరిత్ర, ఇతిహాసాలతో కలిపి కార్తికేయ చేసిన అడ్వంచర్ ఏమిటో తెలుసుకుందాం..
 

* కథ:


కార్తికేయ (నిఖిల్) డాక్టర్. మామూలు డాక్టర్ కాదు.. ప్రతి మూఢనమ్మకం వెనుక సైన్స్ పరిశోధించే సైంటిస్ట్ కమ్ డిటెక్టివ్ లాంటి క్యాలిటీస్ వున్న డాక్టర్. కట్ చేస్తే.. శ్రీ కృష్ణుడి ఆభరణాల కోసం ఒక ముఠా అన్వేషిస్తుటుంది. ఆ ముఠా కారణంగా కార్తికేయ, ముగ్థ‌ (అనుపమ పరమేశ్వరన్) జీవితాలు అడ్వంచర్ గా మలుపు తీసుకుంటాయి ? అసలు ఆ ముఠా ఎవరు ? ఎందుకోసం నిధిని గాలిస్తుంటారు ? కార్తికేయ నిధి వెనుక ఎలాంటి నిజాలు కనుక్కున్నాడు ? చివరికి నిధి దొరికిందా లేదా ? అనేది మిగతా కథ.

 
* విశ్లేషణ:


నిధి అన్వేషణ, చరిత్ర, ఇతిహాసాల నేపధ్యంలో గతంలో చాలా చిత్రాలు వచ్చాయి. `కార్తికేయ 2` నేపధ్యం కూడా ఇదే. అయితే కథని చాలా ఫ్రెష్ గా ప్రజంట్ చేసి ప్రేక్షకుడికి ఎక్సయిట్ మెంట్ ఇవ్వడంలో `కార్తికేయ2`  సక్సెస్ అయ్యింది. కథ ఇంటరెస్టింగ్ రివిల్ చేసుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. లాజిక్ ని వెదికే డాక్టర్ గా నిఖిల్ పాత్ర పరిచయం, కార్తికేయ చిన్న ట్రిక్ ద్వారా పాముని పట్టుకోవడం, కాఫీ కప్పుని ఒక మ్యాజిక్ లా కదిపి దాని వెనుక వున్న ట్రిక్ ని లాజిక్ గా చెప్పడం... ఇలా హీరో పాత్రకి ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేశాయి. 


కథ ద్వారకకి షిఫ్ట్ అయిన తర్వాత కృష్ణ భక్తులకు సంబధించిన ఎపిసోడ్, దాని చుట్టూ వుండే లేయర్లు చాలా ఆసక్తికరంగా వుంటాయి. హిందూమతం నేప‌థ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా చక్కగా ప్రజంట్ చేశాడు దర్శకుడు. సెకండాఫ్  వచ్చేసరికి కథ పూర్తిగా ఒక సహస యాత్రలా మారుతుంది. లార్డ్ శ్రీ కృష్ణ  చుట్టూ అల్లుకున్న కధనం ఒక ఫ్రెష్‌ ఫీలింగ్ ని తీసుకొస్తుంది.  నిజానికి ఈ కథలో చరిత్ర, ఆధ్యాత్మిక, సాహస యాత్ర ఇలా చాలా లేయర్లు వున్నాయి. వాటన్నిటినీ దర్శకుడు అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా తీర్చిదిద్దిన  విధానం నీట్ గా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఐతే అడ్వెంచర్ డ్రామాలకు సినిమాటిక్‌ లిబర్టీ తప్పదు. కార్తికేయ 2 కొన్ని నమ్మశక్యం కానీ ఎలిమెంట్స్ వుంటాయి. దానికి మళ్ళీ లాజిక్ చెప్పుకుంటూ వెళితే అసలు కథపై ప్రభావం పడుతుంది, దర్శకుడు కొన్ని సీన్స్ వివరాల్లోకి వెళ్ళకుండా ప్రేక్షకుడికి ఆసక్తిపైనే ద్రుష్టిపెట్టాడు. కార్తికేయ చిన్న సినిమా. అయితే కార్తికేయ 2కి వచ్చేసరికి బడ్జెట్ విషయంలో ఒక వెసులుబాటు దొరికింది. తనకున్న బడ్జెట్ తోనే  తెలుగులో కూడా ఒక ఇండియానా జోన్స్ లాంటి సినిమా అదించడంలో కార్తికేయ 2 టీమ్ సక్సెస్ అయ్యింది. 


శ్రీ‌కృష్ణుడి కాలి క‌డియం చుట్టూ తిరిగే క‌థ ఇది. దాన్ని వెదికిప‌ట్టుకోవ‌డం హీరో టాస్క్‌. ఆ ప్ర‌యాణం ఓ సాహ‌స యాత్ర‌లా సాగుతుంది. అంత వ‌ర‌కూ ఓకే. కాక‌పోతే.. ఆ క‌డియం లేక‌పోతే జ‌రిగే అన‌ర్థాలేమిటో ద‌ర్శ‌కుడు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌లేదు. కొన్ని సంభాష‌ణ‌లు మ‌రీ లోతుగా ఉన్నాయి. సామాన్య ప్రేక్ష‌కుడికి అవ‌న్నీ ఈజీగా బుర్ర‌కెక్కుతాయా, లేదా?  అనేది ప్ర‌ధాన‌మైన ప్ర‌శ్న‌.


* నటీనటులు :


నిఖిల్ ఈ కథని తన భుజాలపై మోశాడు. నిఖిల్ స్క్రీన్  ప్రజన్స్, డీసెంట్ యాక్టింగ్ ఆకట్టుకుంటాయి. అనుపమ పరమేశ్వరన్  తన పాత్రకు న్యాయం చేసింది. రొటీన్ లవ్ ట్రాక్ లేకపోవడం కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. శ్రీనివాస రెడ్డికి  మంచి పాత్ర దక్కింది. ఆదిత్య మీనన్ పాత్ర కూడా బావుంది. విల‌నే అయినా..  అరుచుకోవ‌డాలూ గ‌ట్రా లేకుండా స్టైలీష్ గా తీర్చిదిద్దారు. అనుపమ్ ఖేర్ పాత్ర చిన్నదే అయినా.. మంచి ఎఫెక్ట్ ని తీసుకొచ్చింది. వైవా హర్షతో పాటు మిగతానటీనటులు పరిధి మేర చేశారు.

 
* సాంకేతిక వ‌ర్గం :


సాంకేతికంగా సినిమా ఉన్నంతంగా వుంది. కాల భైరవ  మిస్టరీ థ్రిల్లర్ జానర్‌ కు తగ్గట్టుగా వుంది. నేపధ్య సంగీతం మంచి ఎలివేషన్ ఇచ్చింది.కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ డీసెంట్ గా వుంది. ఫ్రెష్ లోకేషన్స్ వుండటం వలన సరికొత్త అనుభూతి తెరపై కనిపించింది. దర్శకుడు కథని చాలా గ్రిప్పింగా రాసుకున్నాడు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడిని ఎక్సయిట్ చేయడంతో సక్సెస్ అయ్యాడు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఖ‌ర్చు పెట్టిన ప్ర‌తీ పైసా తెర‌పై క‌నిపిస్తోంది. మొత్తానికి  టాలీవుడ్ కి సీక్వెల్స్ అచ్చిరావనే సెంటిమెంట్ ని బ్రేక్ చేసి ఒక అడ్వెంచర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్. 


* ప్లస్ పాయింట్స్ 


ఆకట్టుకునే కథ,
కథనం 
నిఖిల్ 
విజువల్ ఎఫ్ఫెక్ట్స్ , నిర్మాణ విలువలు


* మైనస్ పాయింట్స్ 


కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవ్వడం 
సినిమాటిక్‌ లిబర్టీ


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్: జయహో.. కార్తికేయ!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS