'అర్జున్‌రెడ్డి' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న హీరో విజయ్ దేవరకొండ. విజయం అన్న మాట కన్నా, రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకున్నాడనాలి. 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా గుర్తింపు పొందినప్పటికీ, 'అర్జున్‌రెడ్డి'తో స్టార్‌డమ్ దక్కింది.
'పెళ్లిచూపులు' సినిమాతోనే హీరోగా అందరి ప్రశంసలు అందుకున్నా, తర్వాత వచ్చిన 'ద్వారక' సినిమాతో కొంచెం నిరాశ పరిచాడు. అయితే ఆ వెంటనే 'అర్జున్‌రెడ్డి' అనూహ్య విజయం అందించింది. ఈ సినిమాని ప్రశంసించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. సినిమాలో కంటెన్ట్ సంగతి ఎలా ఉన్నా స్లాంగ్ విషయానికి వస్తే అంతా తెలంగాణా స్లాంగ్‌లోనే హీరో క్యారెక్టర్ నడుస్తుంది. అలా అని తెలంగాణాలో మాత్రమే ఈ సినిమా విజయం సాధించిందనడానికి లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. అలాగే ఓవర్సీస్‌ని ఈ వైబ్రేషన్స్‌తో ఊపేసింది.
అందుకే ఈ సినిమాకి క్రిటిక్స్‌తో ప్రశంసలు దక్కాయి. నిజానికి సినిమా విడుదలకు ముందే ఎన్నో వివాదాలకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. అయినా కానీ విడుదలయ్యాక విజయాన్ని ఆపడం ఎవ్వరి తరం కాలేకపోయింది. 'బాహుబలి' చిత్రంతో ప్రపంచ గుర్తింపు పొందిన రాజమౌళిని ఈ సినిమా మెప్పించిందంటే అంతకన్నా గొప్ప ప్రశంస ఇంకేముంటుంది చెప్పండి. ఇదంతా ఒక ఎత్తు. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ 'అర్జున్‌రెడ్డి' సినిమా తర్వాత విజయ్ దేవరకొండని 'తెలంగాణా మెగాస్టార్' అని ప్రశంసించారు.
ఈ ప్రశంస అత్యంత ప్రత్యేకం విజయ్ దేవరకొండకు అని చెప్పాలి. అలా అన్ని వర్గాల వారినీ ఈ సినిమా ఆకట్టుకుంది. యూత్‌లో ట్రెండింగ్ అయ్యింది. అలా ఈ ఏడాది బెస్ట్ మూవీస్‌లో 'అర్జున్‌రెడ్డి' సినిమా ముందు వరుసలో నిలిచిందనే చెప్పాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా రెండు మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. 'మహానటి' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.