విజయ్ 'బీస్ట్' సినిమా ఫ్యాన్స్ ని డిస్సాపాయింట్ చేసింది. ఎంతలా అంటే తమిళనాడులో ఒక థియేటర్ స్క్రీన్ ని తగబెట్టేశారు అభిమానులు. విజయ్ హీరోగా ఇలాంటి సినిమా ఏంటి ? అనేది ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం. అయితే ఫ్యాన్స్ ఆగ్రహం ఫిల్మ్ మేకర్స్ కి ఓ సందేశాన్ని ఇచ్చింది. ఫ్యాన్స్ కి హీరోయిజం వుంటే సరిపొతుందనే భావన చాలా మంది ఫిల్మ్ మేకర్స్ లో వుంటుంది. భారీ ఎలివేషన్స్, హీరోయిజం పీక్స్ లో చూపించడం, మాస్ స్టెప్పు .. ఇలా వుంటే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారనేది ఒక లెక్క. కానీ బీస్ట్ విషయంలో ఆ లెక్క తప్పింది.
బీస్ట్ లో కేవలం విజయ్ ఒక్కడే కనిపిస్తాడు. వన్ మ్యాన్ షో. బోర్డర్ లో టెర్రరిస్ట్ లతో విద్వంసకరమైన విన్యాశాలు చేస్తాడు, మాల్ లో హై జాకర్స్ తో దీపావళి పండగ చేసుకునట్లు బుల్లెట్ల వర్షం కురిపిస్తాడు. యుద్ద విమామాన్ని బైక్ నడిపినంత సులువుగా నడిపేస్తాడు. ఇన్ని ఎలివేషన్స్ వున్నా .. బీస్ట్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. సినిమా మొత్తం విజయ్ నే కనిపిస్తున్నా స్క్రీన్ ని తగలబెట్టేశారు ఫ్యాన్స్. ఈ సంఘటనతోనైనా ఇలా ఆలోచిస్తున్న దర్శకుల మైండ్ సెట్ లో మార్పు రావాలి. బలమైన హీరో దొరికితే అంతకంటే బలమైన కథ చెప్పడానికి ప్రయత్నించాలి కానీ అరిగిపోయిన హీరోయిజమ్స్ తో మ్యాజిక్ చేస్తామని ప్రయత్నిస్తే మాత్రం ఇలానే స్క్రీన్ లు తగలబడిపోతాయనే వార్నింగ్ ఇచ్చారు ఫ్యాన్స్.