‘బీస్ట్‌’ మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, సెల్వరాఘవన్, యోగి బాబు తదితరులు
దర్శకత్వం : నెల్సన్ దిలీప్‌ కుమార్
నిర్మాతలు: సన్ పిక్చర్స్
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
ఎడిటర్ : ఆర్. నిర్మల్


రేటింగ్ : 2.5/5


రజనీకాంత్, కమల్ హసన్ తర్వాత కోలివుడ్ హీరోలు తెలుగులో కూడా పట్టుసాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సూర్య, అజిత్ లకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. హీరో విజయ్ కూడా తెలుగు పై ద్రుష్టి పెట్టాడు. విజయ్ సినిమాలు ఇక్కడ డబ్ అవుతున్నాయి. కొన్ని విజయాలు కూడా సాధించాయి. ఇప్పుడు 'బీస్ట్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి మరో విశేషం ‘డాక్టర్‌’తో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు పొందాడు దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌. ఇప్పుడాయన విజయ్ ‘బీస్ట్‌’తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. వీరిద్దరికీ సూపర్ ఫామ్ లో వున్న పూజాహెగ్డే తోడైయింది. సినిమాలో అరబిక్ కుతు పాట ఒక సంచలనంగా మారింది. దింతో పాటు ట్రైలర్ కూడా అంచనాలు పెంచింది. మరి ఇన్ని విశేషాలతో వచ్చిన బీస్ట్ ప్రేక్షకులని ఎలా అలరించిందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.


కథ:


వీర రాఘవన్( విజయ్) పవర్ ఫుల్ రా ఏజెంట్. విదేశాల్లో స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించి టెర్రరిస్టులని మట్టుపెడుతుంటాడు. దేశ సరిహద్దులో నిర్వహించిన ఓ పరేషన్ లో ఉమర్ ఫరూక్ అనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ని ప్రాణాలతో పట్టుకొని దేశానికి అప్పగిస్తాడు. అయితే ఈ ఆపరేషన్ కారణంగా ఓ పాప చనిపోతుంది. ఈ పాప చనిపోవడానికి తానే కారణం అనే గిల్ట్ ఫీలింగ్ తో రా నుండి బయటికి వచ్చేస్తాడు వీర.


కట్ .. చేస్తే ఒక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఒక షాపింగ్ మాల్‌ ని ఆధీనంలోకి తీసుకొని అందులో వున్న వారందరినీ బంధీ చేస్తుంది. అయితే ఇదే షాపింగ్ మాల్ వీర వుంటాడు. ఈ సంగతి తెలిసిన ప్రభుత్వం వీర ని రెస్క్యూలో సహాయపడమని కోరుతుంది. అప్పుడు వీర ఏం చేశాడు? షాపింగ్ లో వున్న బంధీలని టెర్రరిస్ట్ ల నుంచి వీర ఎలా రక్షించాడు ? ఇంతకీ టెర్రరిస్ట్ లు షాపింగ్ మాల్ ని ఎందుకు హైజాక్ చేశారు ? వారి డిమాండ్లు ఏమిటి ? అనే ప్రశ్నలకు జబాబు తెలియాలంటే బీస్ట్ చూడాల్సిందే.


విశ్లేషణ:


విజయ్ సినిమా ఎలా వుంటుందో ప్రేక్షకులకు ఇప్పటికే ఒక ఐడియా వుంటుంది. ఈ చిత్రానికి వచ్చేసరికి దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ కూడా యాడ్ అయ్యాడు. ఆయనది భిన్నమైన శైలి. చాలా సీరియస్ టాపిక్ ని కూడా హెలిరియస్ గా చూపించడంలో దిట్ట. విజయ్ కామెడీ టైమింగ్ కూడా బావుంటుంది. వీరిద్దరూ కలసి ప్రేక్షకులని ఖచ్చితంగా అలరిస్తారనే నమ్మకంతో సినిమా థియేటర్ లోకి అడుగుపెట్టిన ప్రేక్షకుడికి ... నిరాశ ఆవహించడానికి ఎంతో సమయం పట్టదు. అవుట్ డోర్ లో పెద్ద యాక్షన్ సీక్వెన్స్ తో కథని మొదలుపెట్టిన దర్శకుడు మూడో సీన్ తర్వాత సినిమాని ఇండోర్ గేమ్ గా మార్చేశాడు


హైజాక్, రోబరీ కథలు ప్రేక్షకులకి కొత్తకాదు. సింగెల్ లొకేషన్ లో ఆకట్టుకున్న సినిమాలు బోలెడు వున్నాయి. బీస్ట్ సెటప్ కూడా అలాంటిదే. అయితే ఈ ఇన్ డోర్ గేమ్ లో ప్లేయర్ గా కేవలం విజయ్ మాత్రమే కనిపిస్తాడు. గేమ్ అనేది ఇద్దరు ఆటగాళ్ళు వుండాలి. వాళ్ళు సమవుజ్జీలైతే అది మరింత ఆసక్తికరంగా వుంటుంది. కానీ ఈ హైజాక్ గేమ్ లో కేవలం విజయ్ మాత్రమే ఆడుతుంటాడు. షాపింగ్ మాల్ ని ఆధీనంలోకి తీసుకున్న టెర్రరిస్ట్ లు చాల సింపుల్ గా హీరో అధీనంలోకి వెళ్ళిపోతారు.


తనకు నచ్చింది చెస్తుంటాడు హీరో. అతనికి ఎదురేవుండదు. దీంతో కథ మొత్తం ఏకపక్షంగా సాగుతున్న భావన కలుగుతుంది. సినిమా ఫస్ట్ లో హీరో ఎంట్రీ, అరబిక్ కుతు లాంటి పాట కొంత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇంటర్వెల్ కి వచ్చేసరికి సినిమా పాయింట్ ని రివిల్ చేసిన దర్శకుడు.. తర్వాత ఆ పాయింట్ చుట్టూ నడపడానికి కథ లేక సెకండ్ హాఫ్ అంతా ఏం చేయాలో తెలీక అక్కడక్కడే తిరుగుతున్నాడా ? అనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది.


ఇలాంటి హైజాగ్ డ్రామాలకి మైండ్ గేమ్ ముఖ్యం. కానీ బీస్ట్ లో అది కనిపించదు.పైగా డ్రామా అంతా ఫోర్స్ ఫుల్ గా వుంటుంది. హీరో హీరోయిన్ కలిసిన సీన్, తర్వాత హీరో ఒక సెక్యురిటీ ఏజన్సీ ద్వారా షాపింగ్ మాల్ లో లోకి వెళ్ళడం, తర్వాత హైజాక్ జరగడం ఇదంతా అసహజంగా వుంటుంది. నెలన్స్ సినిమాలో బలం కామెడీ. అయితే ఇందులో పాత్రల్లో సహజత్వం లోపించడంతో ఆ పాత్రలు చేసిన కామెడీ కూడా అంత సహజంగా అనిపించదు.


క్లైమాక్స్ కూడా ఊహించినట్లే వుంటుంది. బంధీలు బయటికి వచ్చేసిన తర్వాత ఈ కథ అయిపోయిందనే భావన ప్రేక్షకుడిలో వచ్చేస్తుంది. అయితే ఉమర్ ఫరూక్ ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి హీరో చేసిన యాక్షన్.. నిడివి పెంచడానికే కానీ అది కథ సహకరించలేదు. చివర్లో వరుణ్ డాక్టర్ సినిమాలా ఒక బీచ్ సాంగ్ ప్లాన్ చేశారు. కానీ అప్పటికే ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటికి అడుగుపెట్టేస్తాడు.


నటీనటులు:


యాక్షన్.. విజయ్ కి కొత్తకాదు. ఎలాంటి పాత్రనైన తన బాడీలాంగ్వేజ్ కి అనుగుణంగా మార్చుకునే విజయ్ .. ఇందులో వీర పాత్రని చాలా సులువుగానే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తనదైన ట్రేడ్ మార్క్ లో యాక్షన్ సీన్స్ తో అభిమానులని అలరించాడు. నిజానికి ఇది విజయ్ వన్ మ్యాన్ షో. పూజ హెగ్డే పాత్రకి కథలో ప్రాధాన్యత లేదు. అయితే అరబిక్ కుతు పాటలో విజయ్, పూజ వేసిన స్టెప్పులకు థియేటర్ లో విజల్స్ పడ్డాయి. యోగిబాబు పాత్రని ఇంకా పెంచాల్సింది. తన పాత్రని హైజాక్ డ్రామాలో బాగం చేసుకుంటే నవ్వులు పూయించే అవకాశం వుండేది. సెల్వ రాఘవన్ పాత్ర మనీహీస్ట్ లో నేగోసియేటర్ పాత్రని గుర్తుకు తెస్తుంది. సెక్యురిటీ మేనేజర్ గా వీటీవీ గణేష్ పాత్ర కొన్ని చోట్ల నవ్విస్తుంది. మిగతానటీనటులు పరిధిమేర చేశారు.  
 

టెక్నికల్ గా:


మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. అనిరుద్ అందించిన పాట అరబిక్ కుతు ఓ సంచనలం. థియేటర్ లో కూడా ఆ పాట బాగానే పేలింది. నేపధ్య సంగీతం బావుంది. నిర్మాణ విలువలు వున్నంతంగా వున్నాయి.


ప్లస్ పాయింట్


విజయ్
కొన్ని చోట్ల నవ్వులు
అరబిక్ కతు పాట, నేపధ్య సంగీతం
నిర్మాణ విలువలు


మైనస్ పాయింట్


కథ వీక్ గా వుండటం
బలమైన విలన్ లేకపోవడం
పాత్రల మధ్య సంఘర్షణ లోపించడం  
 

ఫైనల్ వర్దిక్ట్ : బీస్ట్.. నాట్ సో బెస్ట్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS