మెర్సల్ చిత్రానికి టైటిల్ చిక్కులు

మరిన్ని వార్తలు

టైటిల్ వివాదాలు చిత్రాలకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇక పెద్దపెద్ద చిత్రాల టైటిల్స్ పైన వేరే నిర్మాతలు కేసులు వెయ్యడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయాయి.

తాజాగా ఆ జాబితాలో విజయ్ మెర్సల్ చిత్రం చేరింది. వివరాల్లోకి వెళితే, ఏఆర్ ప్రొడక్షన్స్ వారు దాదాపుగా ఇదే టైటిల్ తో ఒకటి ఇప్పటికే నిర్మాతల మండలిలో రిజిస్టర్ చేయించినట్టు చెబుతున్నారు. అలాగే ఈ విషయమై చెన్నై హైకోర్టులో పిటీషన్ వేసారు.

దీనిని స్వీకరించిన కోర్టు, రెండు వారాల్లో దీనికి సమాధానం చెప్పాలని విజయ్ & కో ని కోరింది. దీనితో ఈ చిత్రం టైటిల్ పైన తీవ్ర చర్చ మొదలయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS