సినీ పరిశ్రమలో రూమర్స్ కామన్. వరుసుగా రెండు సినిమాలు కలసి నటిస్తే హీరో హీరోయిన్లపై ఆటోమేటిక్ గా రూమర్స్ వచ్చేస్తాయి. అయితే వీటిని లైట్ తీసుకువడం కూడా అంతే కామన్. అయితే టాలీవుడ్ లో మాత్రం ఇప్పుడో రూమర్ సదరు హీరోయిన్ ఇంట్లో కూడా హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ దేవర కొండ, రష్మిక మందన హిట్ పెయిర్. గీతా గోవిందంలో వీరి కెమిస్ట్రీ అదుర్స్. ఈ సినిమా జరుగుతున్నప్పుడు వీరి మధ్య రూమర్స్ వచ్చాయి. లిప్ లాప్ చూసిన తర్వాత ఆ రూమర్స్ మరింత పెరిగాయి.
ఇదే సందర్భంలో రష్మిక యంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడం కూడా హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత విజయ్ తో 'డియర్ కామ్రేడ్' లో మరోసారి విజయ్ తో జోడి కట్టింది రష్మిక. అయితే ఈసారి మాత్రం రష్మిక ఇంట్లో ఒప్పుకోలేదట. విజయ్ తో మళ్ళీ వద్దని ఖారండిగా చెప్పేశారట. కానీ తానే పట్టుబట్టి ఈ సినిమా చేశానని, దీనికి కారణం ఈ సినిమాలో లిల్లీ పాత్ర అంతలా నచ్చిందని చెప్పింది రష్మిక.
ఈ మాట చెప్పింది ఎక్కడో అఫ్ ది రికార్డ్ ఇంటర్వ్యూలో కాదు. పబ్లిక్ గా స్టేజ్ మీద చెప్పింది రష్మిక. బేసిగ్గా ఇలాంటి రూమర్స్ గురించి పెద్దగా ప్రస్థావించరు. కానీ విజయ్ తో సినిమా అంటే తన ఇంట్లో ఎన్ని అనుమాలు వచ్చాయో.. ఎలాంటి దాపురికం లేకుండా చెప్పింది రష్మిక. ఆమె మాటలు వింటుంటే..విజయ్ తో మరోసారి అంటే ఆమె ఇంటి నుండి సపోర్ట్ దొరికేలా లేదు .