ఓ కథానాయకుడికి వంద కోట్ల పారితోషికం...అది సౌత్ ఇండియాలో. ఇది ఎప్పుడైనా ఊహించామా? అయితే... ఇప్పుడు వంద కోట్ల పారితోషికం అంటే, సామాన్యమైన విషయం అయిపోయింది. రజనీకాంత్, ప్రభాస్‌లు ఎప్పుడో ఈ అంకెని అందుకున్నారు. ఇప్పుడు.. విజయ్ కూడా `వంద కోట్లకు పైసా కూడా తగ్గేదే లే` అంటున్నాడు. నిన్నా మొన్నటి వరకూ విజయ్ పారితోషికం 70 నుంచి 80 కోట్లే. అయితే ఇప్పుడు తాజాగా తాను కూడా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.
వంశీ పైడిపల్లితో విజయ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. విజయ్ చేస్తున్న తొలి స్ట్రయిట్ సినిమా ఇదే. ఈ సినిమాకి గానూ.. విజయ్ వంద కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడు. డీల్ కూడా కుదిరిపోయింది. తొలుత రూ.10 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారు. సినిమా మొదలయ్యేటప్పటికి మరో 30 కోట్లు ఇవ్వాలి. సగం సినిమా అయ్యేనాటికి మరో 30 కోట్లు... మిగిలిన 30 చివర్లో ఇస్తారు. ఇదీ డీల్. ప్రస్తుతం వంశీ పైడిపల్లి పూర్తి స్థాయి స్క్రిప్టు తయారు చేసుకునేపనిలో ఉన్నాడు. త్వరలోనే.. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.