విజయ్‌ 'సర్కార్‌' ఇక్కడా గెలిచింది.!

మరిన్ని వార్తలు

బహుశా మొట్ట మొదటిసారి తెలుగులో విజయ్‌ సినిమాకి లాభాలు వచ్చేలా ఉన్నాయి. 'సర్కార్‌' సినిమా తెలుగులో అంచనాలకు మించి మంచి విజయాన్ని అందుకున్నట్లు ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. వాస్తవానికి తెలుగులో విజయ్‌కి మార్కెట్‌ చాలా తక్కువ. విజయ్‌ హిట్‌ సినిమాలు కూడా తెలుగులో పెద్దగా ఆడవు. 

అలాంటిది 'సర్కార్‌' సినిమా తెలుగులో బాగానే వసూళ్ల కొల్లగొడుతోంది. ఇప్పటికే 'సర్కార్‌' ఏడున్నర కోట్లు పైనే వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. డబ్బింగ్‌ రైట్స్‌ కొన్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్‌ ఇలా ప్రతీ ఒక్కరూ సేఫ్‌ జోన్‌లోకి వెళ్లారనీ తెలుస్తోంది. వాస్తవానికి 'సర్కార్‌' సినిమా నెగిటివ్‌ రివ్యూలను రాబట్టింది. అయినా కానీ వసూళ్లు స్టడీగా ఉన్నాయి. 

తమిళనాడులో ఈ సినిమాపై కోర్టు కేసులు ఇంకా నడుస్తున్నాయి. దాంతో సింపథీ వర్కవుట్‌ అయ్యింది. మరోపక్క డబ్బింగ్‌ సినిమాలతో ఫెయిల్యూర్స్‌ చవి చూస్తోందనుకుంటోన్న కీర్తి సురేష్‌ అనూహ్యంగా పుంజుకుంది 'సర్కార్‌'తో. ఆమె నటించిన 'పందెం కోడి 2' కూడా తెలుగులో సేఫ్‌ ప్రాజెక్ట్‌ అయ్యింది. 

'సామి 2' సినిమాతో కాస్త నిరాశపరిచినా ఈ రెండు సినిమాలతో సేఫ్‌ జోన్‌లోకి వెళ్లి, తాను అదృష్ట దేవతనే అని నిరూపించేసుకుంది. తెలుగులో కీర్తి చేతిలో ప్రస్తుతం సినిమాలేమీ లేవు. కానీ మళ్లీ త్వరలో డబ్బింగ్‌ చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకు రానుంది కీర్తి సురేష్‌. సూర్య హీరోగా తెరకెక్కుతోన్న 'ఎన్‌జీకే' చిత్రంలో కీర్తిసురేష్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS