విజయ్ సేతుపతి... సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అయిపోయాడు. ముఖ్యంగా విలన్ పాత్రలకు విజయ్ పర్‌ఫెక్ట్‌గా సూటైపోతాడని జనం నమ్ముతున్నారు. `మాస్టర్`లో విజయ్ సేతుపతి విలన్ గా విజృంభించడంతో తనపై నమ్మకాలు మరింత బలపడిపోయాయి. ఇప్పుడు తాజాగా `సలార్`లో విలన్ పాత్ర.. విజయ్ సేతుపతికి అప్పగిస్తే ఎలా ఉంటుందా? అని ఎదురు చూస్తున్నార్ట. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం `సలార్`.
ఇదిపాన్ ఇండియా ప్రాజెక్టు. అందుకే.. విలన్ పాత్ర కోసం తమిళ, హిందీ సీమల నుంచి ఓ స్టార్ ని దించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ ఛాన్స్ విజయ్ సేతుపతికి దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై.. చిత్రబృందం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. కాకపోతే.. సలార్‌ని సంక్రాంతి బరిలో నిలపాలని మాత్రం ఫిక్సయ్యార్ట.
2022 సంక్రాంతికి సలార్ విడుదల చేయడం ఖాయమని సమాచారం అందుతోంది. నవంబరు నాటికి షూటింగ్ పూర్తి చేసి, డిసెంబరులో ప్రమోషన్లు మొదలెట్టాలన్నది ప్లాన్. సంక్రాంతికి ప్రభాస్ సినిమా బరిలో ఉంటే.. ఇక చెప్పేదేముంది? పూనకాలే.