'సైరా నరసింహారెడ్డి'లో రాముడికి లక్ష్మణుడి లెక్క అంటూ తమిళ భూ భాగం నుండి వచ్చి, నరసింహారెడ్డికి నమ్మిన బంటుగా మారిన యోధుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత తెలుగులో విజయ్ సేతుపతి పేరు మార్మోగిపోయింది. అంతకన్నా ముందే, మెగా చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా డెబ్యూ చేస్తున్న 'ఉప్పెన' సినిమాలో కీలక పాత్రకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమాలోనూ కీలక పాత్ర చేస్తున్నాడు విజయ్ సేతుపతి. తెలుగులో ఇన్ని వరుస ఆఫర్లు దక్కించుకున్న విజయ్ సేతుపతి తమిళంలో నటించిన 'సంగతమిళన్' చిత్రాన్ని తెలుగులో ఆయన పేరుతోనే విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. అదే 'విజయ్‌సేతుపతి'.
ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్ట్రెయిట్ మూవీ 'తెనాలి రామకృష్ణ'తో పాటు, విశాల్ నటిస్తున్న డబ్బింగ్ మూవీ 'యాక్షన్' ఇదే రోజు రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాల పైనా ఓ మోస్తరు బజ్ మాత్రమే ఉంది. ఆ రెండింటికీ ఏమాత్రం తక్కువ కాకుండా తెలుగు రాష్ట్రాల్లో 'విజయ్ సేతుపతి'పై బజ్ క్రియేట్ అవడం విశేషం. ఒక్క నైజాంలోనే 100 ధియేటర్స్‌లో 'విజయ్ సేతుపతి' సినిమా రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ మాస్‌ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. విజయ్ సేతుపతి మాస్ ఆటిట్యూడ్, అందాల రాశీఖన్నా గ్లామర్ వంపు సొంపులు వెరసి, ఈ తమిళ హీరో వసూళ్లు కూడా బాగానే రాబడతాడేమో చూడాలిక.!