అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో 'పుష్ష' రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ విజయ్‌సేతుపతి విలన్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన. పోస్టర్ని కూడా అన్ని భాషల్లోనూ డిజైన్ చేసి వదిలారు. అయితే.. ఇప్పుడు `పుష్ష` ప్లానింగ్‌కి విజయ్‌సేతుపతి మోకాలడ్డుతున్నాడు. ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ తమిళంలో విడుదల చేయకూడదని అంటున్నాడట. దానికి కారణం.. విజయ్‌సేతుపతి తమిళంలో పెద్ద స్టార్. అక్కడ హీరో పాత్రలే చేస్తున్నాడు.
తెలుగులో విలన్‌గా నటించడం, హీరో చేతుల్లో తన్నులు తినడం తన ఫ్యాన్స్‌కి నచ్చదని విజయ్ భయం. దాని వల్ల తమిళంలో తన మార్కెట్‌పై ప్రభావం పడుతుందని భయపడుతున్నాడు. దాని బదులుగా.. తమిళం వెర్షన్‌కి మాత్రం తన పాత్రని మరో నటుడితో చేయించుకోవాలని సూచించాడట. అంటే ఇప్పుడు సుకుమార్‌కి డబుల్ పని. మిగిలిన వెర్షన్స్‌ని విజయ్‌తో, ఒక్క తమిళ వెర్షన్‌ని మాత్రం మరో నటుడితో భర్తీ చేస్తారు. అంటే ఒకే రోజు, ఒకేషాట్ రెండు సార్లు, ఇద్దరు వేర్వేరు నటులతో తీయాలన్న మాట. మరి ఈ ప్రతిపాదనకు చిత్రబృందం ఏమంటుందో?