బన్నీ సినిమాలో విజయ్‌ సేతుపతి పాత్రేంటో తెలుసా?

By Inkmantra - March 10, 2020 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

‘రంగస్థం’ సినిమా తర్వాత మన లెక్కల మాస్టార్‌ సుకుమార్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న ఈ సినిమాలో ఆయా పాత్రధారుల సంగతి ప్రస్తుతం చర్చకొస్తోంది. ఆ క్రమంలో విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్నాడనే ప్రచారం ఉంది. అయితే, విజయ్‌ సేతుపతి నటిస్తున్నాడంటే, ఆయనది విలన్‌ పాత్రే అయ్యుంటుంది.. అనుకుంటున్నారు కొందరు. కానీ, విజయ్‌ సేతుపతిది ఈ సినిమాలో విలన్‌ పాత్ర కాదట.

 

ఫారెస్ట్‌, స్మగ్లింగ్‌.. బ్యాక్‌ గ్రౌండ్‌లో తెరకెక్కే ఈ సినిమాలో కీలకమైన ఫారెస్ట్‌ ఆఫీసర్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి కనిపించబోతున్నారట. బన్నీకి సపోర్టింగ్‌ రోల్‌ అనీ తెలుస్తోంది. అలాగే, మరో నటుడు జగపతి బాబుకీ ఈ సినిమాలో ఓ మంచి పాత్ర ఉందట. అలాగే కన్నడ నటుడు రాజ్‌ దీపక్‌ శెట్టి కూడా ఈ సినిమాలో ఓ పాత్ర పోషిస్తున్నారు. ఇక రంగమ్మత్త అనసూయకీ ఈ సినిమాలో మరో అవకాశం ఇచ్చాడట సుకుమార్‌. హీరో, హీరోయిన్స్‌ లేకుండానే ఇతర పాత్రధారులపై ఎప్పటి నుండో ఈ సినిమా షూటింగ్‌ కానిచ్చేస్తున్నాడు సుకుమార్‌. ఇక రేపో మాపో హీరో, హీరోయిన్స్‌ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రూపొందుతోన్నా సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS