విలన్స్ పాత్రల్లో ఇంత వరకూ చాలా మందిని చూసేశాం. కానీ, ‘మాస్టర్’ సినిమాలో విలనిజం నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉంటుందట. అసలు ఆ పాత్రకు విజయ్ సేతుపతినే ఎందుకు ఎంచుకున్నారో అనే విషయంలో సినిమా చూసిన ప్రతీ ఆడియన్ అభిప్రాయం ఒకేలా ఉంటుందట. అంతలా ఆ పాత్ర చిత్రీకరణ జరిగిందట. ఆ పాత్రకు విజయ్ సేతుపతి హండ్రెడ్ పర్సంట్ న్యాయం చేసి చూపించాడంటున్నాడు హీరో విజయ్. విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘మాస్టర్’. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకి దర్శకుడు. మాళవికా మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
త్వరలో రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రీసెంట్‌గా జరిగింది. కరోనా కారణంగా ఈ ఫంక్షన్‌ని చాలా తక్కువ మంది అతిధులు, అభిమానులతో సింపుల్‌గా చిన్న ప్రయివేట్ ఫంక్షన్‌గా తేల్చేశారు. ఇక రిలీజ్ విషయంలో ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. కరోనా కారణంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో ధియేటర్స్ మూసి వేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో రిలీజ్ కావల్సిన చాలా సినిమాలు రిలీజ్ డేట్‌ని వాయిదా వేసుకున్నాయి. మరి, విజయ్ ‘మాస్టర్’ ఏమవుతుందో చూడాలిక.