ఒకరు విజయ్ దేవరకొండ. యూత్ లో పిచ్చ క్రేజ్ ఉన్న హీరో. మరొకరు సుకుమార్. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే..? అంచనాలు మామూలుగా ఉండవు. విజయ్ - సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందన్న ప్రకటన సినీ అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. అప్పుడే ఈ సినిమాపై వార్తలు, పుకార్లు మొదలైపోయాయి. ఎప్పుడో 2022లో మొదలయ్యే సినిమా ఇది. ఈలోపు ఎన్ని జాతకాలు మారతాయో, కోవిడ్ కష్టకాలంలో సినిమా పరిస్థితి ఏమిటో? ఇప్పుడే అంచనా వేయలేం.
కానీ ఈ సినిమాపై ఇప్పటికే 15 కోట్లు ఖర్చు పెట్టేశారు. సుకుమార్‌కి అడ్వాన్స్ గా 10 కోట్లు, విజయ్‌కి అడ్వాన్స్‌గా మరో 5 కోట్లు ఇచ్చారని సమాచారం. అంటే 15 కోట్లు అయిపోయాయన్నమాట. నిజానికి... ఎగ్రిమెంట్లు కుదుర్చుకున్నప్పుడు 20 శాతం పారితోషికం ఇవ్వడం ఫార్మాలిటీ. కానీ.. ఒకరికి 10, మరొకరికి 5 ఇచ్చేశారంటే నిర్మాతలు దూకుడుగా ఉన్నట్టే. కోవిడ్ కాలంలో.. నిర్మాతలు జేబుల్లోంచి డబ్బులు తీయడానికి ముందూ వెనుకా ఆలోచిస్తున్నారు. అలాంటి సమయంలో నిర్మాతలు 2022లో తీయబోయే సినిమాకి అప్పుడే 15 కోట్లు ఖర్చు పెట్టారంటే... ఇది కాంబినేషన్ పై క్రేజ్ తప్ప మరోటి కాదు.