దేవరకొండ తో సూపర్ స్టార్ సినిమా?

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలలో హీరోగా నటించడమే కాకుండా పలు రకాల బిజినెస్ లు కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఎఎంబీ సినిమాస్ పేరుతో మల్టిప్లెక్సులు, హంబుల్ కో పేరున దుస్తుల బ్రాండ్ ఇలా పలు రంగాలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సినిమాల నిర్మాణం కూడా చేపడుతున్నారు. తను నటించే సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించమే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు.

 

ఇప్పటికే జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అడివి శేష్ హీరోగా 'మేజర్' అనే హిందీ తెలుగు ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ మరో సినిమా నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని, యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తారని అంటున్నారు. 'మహర్షి' సినిమా తర్వాత వంశీ పైడిపల్లి మరో సినిమా సైన్ చెయ్యలేదు. మహేష్ తో ఒక సినిమా అనుకున్నారని వార్తలు వచ్చినా అదేమీ కార్యరూపం దాల్చలేదు. మరి అదే సబ్జెక్ట్ తో ఇప్పడు విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

 

ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మరే ఇతర ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి మహేష్ బ్యానర్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రమే విజయ్ తదుపరి చిత్రం కావొచ్చని అంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS