కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా విజయ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భార్య వనిత ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోయింది. విజయ్ ఆత్మహత్య కు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియాలో తన భార్య తో సహా మరో ఇద్దరు పేర్లు ప్రస్తావించటంతో వారికి నోటీసులు జారీ చేశారు.
దీంతో ఆమె అజ్ఞాతం లోకి వెళ్ళి పోలీసులకు లొంగకుండా సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తూ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. అయితే తాను ఇన్ని రోజులు కనపడకుండా ఉన్నది కేవలం ఆధారాలు సేకరించటానికి మాత్రమే అని, అందరూ అనుకుంటున్నట్లు విజయ్ తన వల్ల చనిపోలేదని, తాను సేకరించిన ఆధారాలు పోలీసులకు ఇవ్వటానికి ఈరోజు స్టేషన్ కి వచ్చినట్లు వనితా రెడ్డి తెలిపింది.
ఇక విజయ్ సాయి సెల్ఫీ వీడియా పై స్పందిస్తూ, అందులో మాట్లాడినవన్నీ అబద్ధాలు అని.. తల్లిదండ్రులు వేధింపుల వల్ల చనిపోతే, అతను నాపేరు ఎందుకు చెప్పాడో తెలియదని పేర్కొంది. నేను అతనితో మూడేళ్ళ నుండి దూరంగా ఉంటున్నాను, ఇప్పటికే విజయ్ వేరే మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు మీడియాకు ఇచ్చానని, అతడి నిజ స్వరూపం ఏమిటో పోలీసులకు ఇచ్చే సాక్ష్యాలను బట్టి తెలుస్తుందని వనితా రెడ్డి తెలిపింది.