పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున ప్రజాయాత్ర మొదలుపెట్టి నేటికి మూడవరోజు. ఈ మూడురోజులు ఆయన తెలంగాణ రాష్ట్రంలోనే పర్యటిస్తారు. అయితే తెలంగాణ ఏర్పాటు తరుణంలో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం కావడంతో అప్పట్లో ఆయన పైన తీవ్ర దుమారమే లేచింది.
ఇక ఈ మధ్యనే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలవడం ఆ తరువాత ఆయన ఈ పర్యటన చేస్తుండడం పట్ల ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్, బీజీపీ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక ప్రముఖ నటి రాజకీయ నాయకురాలు అయిన విజయశాంతి తన విమర్శలు పవన్ కళ్యాణ్ పైనే ఎక్కుపెట్టింది.
తెలంగాణ వ్యాప్తంగా పర్యటించాలి అని అనుకున్న JAC నేతలకి ఉన్న అభ్యంతరాలు పవన్ కళ్యాణ్ విషయం వచ్చే సరికి ఎందుకు లేవు అని ప్రశ్నించారు. ఒకప్పుడు తెలంగాణ వచ్చినందుకు అన్నం మానేసాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు ఎలా ఇక్కడి బాగోగులు చూసుకోగలుగుతాడు అని ఆమె ప్రశ్నించింది.
ఇక అదే విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ- తెలంగాణ లో తిరగడానికి పవన్ కళ్యాణ్ కి వీసా ఎలా ఇచ్చారు తమవరకి వస్తే ఎందుకీ వివక్ష అంటూ ప్రశ్నించింది. మొత్తానికి తెలంగాణలో పవన్ కళ్యాణ్ యాత్ర రాజకీయంగా ఒక చర్చని అయితే లేవదీసింది అని చెప్పాలి.