తెలుగులో అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు విజయ నిర్మల. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి. మంచి నటి కూడా. ఆమెకు రాయల్ ఆకాడమీ గౌరవ డాక్టరేట్‌ని ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నానక్ రామ్ గూడలోని ఆమె నివాసానికి వెళ్లి విజయనిర్మలని ఘనంగా సన్మానించారు. అంతేకాదు ఆమె పేరును పద్మ భూషణ్ పురస్కారానికి ప్రతిపాదిస్తామని హామీ ఇచ్చారు కూడా. ఈ సందర్భంగా సీనియర్ నటులు విజయ నిర్మల భర్త కృష్ణ మాట్లాడుతూ ఇప్పటికే విజయ నిర్మల పేరును సీఎం కేంద్రానికి ప్రతిపాదించారనీ తెలిపారు. కృష్ణ పక్కనే కూర్చొని ఈ డాక్టరేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. విజయ నిర్మల కేవలం తెలుగులో అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళ కాదు, ఇండియాలోనే ఈమె రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేసింది లేదు. దర్శకురాలిగానే కాకుండా, నటిగా ఎన్నో మంచి చిత్రాల్లో నటించింది. 'అల్లూరి సీతారామరాజు' సినిమాలో సీత పాత్రకి ప్రాణం పోసింది ఆమె తన నటనతో. ఆమె కెరీర్‌లో ఇలాంటి చిత్రాలు అనేకం. అందుకే ఈ అవార్డు ఆమెకి దక్కడం ఆమెకే కాదు ఓ టాలీవుడ్ లేడీ డైరెక్టర్‌గా టాలీవుడ్ అంతా గర్వపడాల్సి అంశమే.