రాములమ్మ రాజకీయ ప్రస్థానానికి ‘రెండు దశాబ్దాలు’

మరిన్ని వార్తలు

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు అయిన విజయశాంతి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నది. ఈ తరుణంలో విజయశాంతి అలియాస్ రాములమ్మ రాజకీయ ప్రస్తానం గురించిన కొన్ని కీలక సంఘటనలు మీ కోసం-

1. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేస్తామని చెప్పడంతో 1998 జనవరి 26న బీజేపీ అగ్రనేతలు వాజపేయి, అద్వానీల సమక్షంలో విజయశాంతి BJPలో చేరడం జరిగింది.

2. విజయశాంతి BJPలో చేరినప్పుడు వాజపేయి గారు అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని గుర్తు చేసుకోవాలి. విజయశాంతి బీజేపీలో చేరడం వల్ల తమ పార్టీకి మొదటి విజయం సాధించింది అని తర్వాత దేశంలో శాంతి వస్తుంది అని వ్యాఖ్యానించడం కొసమెరుపు.

 

3. BJP మహిళామోర్చా ఉపాధ్యక్షురాలిగా రెండుసార్లు, బీజేపీ జాతీయకార్యవర్గ సభ్యురాలిగా ( BJP National Executive Council Member) పనిచేశారు. 1998 నుండి 2005 మే 25వరకు BJPలో కొనసాగారు.

4.1998, 1999,2004లో జరిగిన ఎన్నికల్లో APతో పాటుగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, బెంగాల్, ఒరిస్సా, ఢిల్లీ రాష్ట్రాలలోప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 500 ర్యాలీలలో పాల్గోని ప్రచారం చేశారు.

5. 1999 నుండి 2004 వరకు కేంద్రంలో NDA అధికారంలో ఉన్నప్పుడు National Executive Council Meetingలో తెలంగాణ గురించి నిర్ణయం తీసుకోమని విజయశాంతి డిమాండ్ చేశారు. కాని TDP అప్పటి NDAలో భాగస్వామిగా ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ ఒత్తిడితో తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టేశారు. దీంతో ఆనాడు BJP అధిష్టానంతో తీవ్రంగా విభేదించి 2004 ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు అంటిముట్టనట్టు వ్యవహరించారు.

6. 2004 నుంచి 2005 ఏప్రిల్ నాటికి BJP అధిష్టానంతో రాములమ్మ విభేదాలు తారాస్థాయికి చేరాయి. 2004 ఎన్నికల్లో BJP పరాజయం పాలైన నేపధ్యంలో తెలంగాణ ఉనికి కాపాడే ఉద్దేశ్యంతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించడానికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. దీనికి BJP నిరాకరించడంతో 2005 మే 25న బీజేపీకి రాజీనామా చేశారు.

7. BJP పార్టీకి రాజీనామా చేసిన విజయశాంతి ,జాతీయ పార్టీ అయిన బీజేపీలో కీలక పదవులు అనుభవించినా, మళ్ళీ పదవుల కోసం పాకులాడకుండా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో చేరకుండా, ఎన్ని అవకాశాలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా తాను నమ్మిన తెలంగాణ సిద్ధాంతానికి కట్టుబడ్డారు. తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు.

8. 2009 జనవరి వరకు తెలంగాణలో విజయశాంతి నేతృత్వంలోని తల్లి తెలంగాణ పార్టీ తరపున పలు ప్రజా సమస్యల పై పోరాడారు. 2004 నుండి 05 వరకు TRS-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉండటంతో తెలంగాణలో విజయశాంతి ప్రతిపక్ష పాత్ర పోషించారు. 2009 ఎన్నికల నాటికి తెలంగాణలో రెండు ఉద్యమ పార్టీలు ఉండటం కంటే, ఒకే వేదిక ద్వారా పోరాటం చేయడం మేలు అని ప్రొఫెసర్ స్వర్గీయ జయశంకర్ సార్ రాములమ్మకు సూచించడం జరిగింది. ఆయన సూచన మేరకు విజయశాంతి తన తల్లి తెలంగాణ పార్టీని 2009 ఎన్నికల ముందు TRSలో విలీనం చేశారు.

9. 2009 ఎన్నికల్లో YSR ప్రభంజనాన్ని తట్టుకుని కేసిఆర్, విజయశాంతి మాత్రమే గెలవగాలిగారు. ఇక మలిదశ ఉద్యమం ఊపందుకున్న తరుణంలో రాములమ్మ పోషించిన పాత్ర ఎవరు మరువలేనిది. అంకెలకందని అరెస్టులు, పోరాటాలు, పార్లమెంటుని స్తంభింప చేయడం. ఇలా ఉద్యమంలో ఏ పేజీ తిరగేసిన రాములమ్మ మనకి కనిపించక మానదు.

10. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞత తెలిపేరీతిలో రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఫిరాయింపులతో కలుషితమైన తెలంగాణ రాజకీయాలకి కొంతకాలంగా దూరంగా ఉన్న రాములమ్మ వాటిని ప్రక్షాళన చేసే ఉద్యమంలో పాల్గొనేందుకు నడుం బిగించారు. క్రీయాశీలక పాత్ర పోషించేందుకు సన్నద్ధమవుతున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS