అప్పట్లో మెగాస్టార్‌తో సమానంగా డాన్సులు, యాక్షన్.. ఇలా అన్నింట్లోనూ తనదైన పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు ముద్దుగుమ్మ విజయశాంతి. అందుకే చిరంజీవిని మెగాస్టార్ అంటే, విజయశాంతిని లేడీ సూపర్‌స్టార్ అనేవారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించి, లేడీసూపర్‌స్టార్‌గా అభిమానుల మనసుల్లో నిలిచిపోయిన విజయశాంతి, తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక, నటనకు గుడ్‌బై చెప్పేశారు. చాలాసార్లు చాలా అవకాశాలు వచ్చినా, తన తోటి హీరోయిన్లు నటనలో కొనసాగుతున్నా, విజయశాంతి మాత్రం నటనపై ఆశక్తి చూపించలేదు.
గత కొంతకాలంగా విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ, అవేమీ అంత నమ్మశక్యంగా అనిపించలేదు. ఎట్టకేలకు విజయశాంతి రీ ఎంట్రీ షురూ అయ్యింది. అది కూడా ఆషామాషీ సినిమాతో కాదు, సూపర్‌స్టార్ మహేష్‌బాబు సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. విశేషమేంటంటే, హీరోయిన్‌గా తొలి సినిమా ఆ సూపర్‌స్టార్ కృష్ణ నటించిన 'ఖిలాడీ' సినిమా అయితే, రీ ఎంట్రీలో తొలి సినిమా ఆ సూపర్‌స్టార్ వారసుడు ఈ సూపర్‌స్టార్ మహేష్‌బాబు సినిమాలో నటిస్తుండడం సంతోషంగా ఉందని విజయశాంతి అన్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ సినిమా కోసం మళ్లీ ముఖానికి రంగు వేసుకుంటున్నారు విజయశాంతి. విజయశాంతి రీ ఎంట్రీ ఆమె అభిమానుల్లోనూ ఉత్సాహాన్ని నింపుతోంది