సినిమాల విష‌యంలో విజ‌య‌శాంతి ప్లానింగ్ ఏమిటి?

మరిన్ని వార్తలు

స‌రిలేరు నీకెవ్వ‌రుతో 13 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌స్తోంది విజ‌య‌శాంతి. ఈ సినిమా కోసం విజ‌య‌శాంతికి క‌నీవినీ ఎరుగ‌ని పారితోషికం ఇచ్చార‌ని బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా త‌ర‌వాత విజ‌య‌శాంతి ఇక వ‌రుస‌గా సినిమాలు చేస్తార‌ని కూడా చెప్పుకుంటున్నారు. కోట్ల‌కి కోట్లు డ‌బ్బులు వ‌చ్చిప‌డుతుంటే - సినిమాల‌కు ఎందుకు దూరంగా ఉండాలి..? అందుకే విజ‌య‌శాంతి కూడా ఇక వ‌రుస పెట్టి సినిమాలు చేస్తుంద‌ని భావించారు. వీటిపై విజ‌య‌శాంతి క్లారిటీగానే ఉంది.

 

వ‌రుస పెట్టి సినిమాలు చేసే ఉద్దేశం త‌న‌కు లేద‌ని, త‌న ప్రాధాన్యం రాజ‌కీయాల‌కే అని, ఆ త‌ర‌వాత స‌మ‌యం మిగిలితే, పాత్ర న‌చ్చితే అప్పుడు సినిమాల గురించి ఆలోచిస్తాన‌ని అంటోంది. అయితే... స‌రిలేరు నీకెవ్వ‌రుపై విజ‌య‌శాంతి చాలా ఆశ‌లు పెంచుకుంది. ఈ సినిమాలో విజ‌య‌శాంతి పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంది. ఇక మీద‌ట త‌న కోసం ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు పాత్ర‌లు రాసుకుంటార‌ని న‌మ్ముతోంది. ద‌ర్శ‌కులు కూడా `స‌రిలేరు నీకెవ్వ‌రు`లో లేడీ అమితాబ్ విజృంభ‌ణ చూడాల‌నుకుంటున్నారు. విజ‌య‌శాంతి పాత్ర పండితే - ఆ త‌ర‌హా పాత్ర‌లు సృష్టించ‌డానికి రెడీ అయిపోతున్నారు. సో.. మంచి పాత్ర వ‌స్తే విజ‌య‌శాంతి ఎందుకు వ‌దులుకుంటుంది. ఇక విజ‌య‌శాంతిని ఒప్పించిచాల్సిన బాధ్య‌త క‌థ‌కులు, ద‌ర్శ‌కుల‌దే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS