దిల్ రాజు తో సినిమా అంటే ఆయన కండీషన్ కి కట్టుబడాల్సిందే. కథపై చాలా చర్చలు వుంటాయి. తన ఆస్థానంలో వున్న రచయితలందరితోనూ కథలో ఎత్తుపల్లాలు, లోటుపాట్లు గురించి ఓపెన్ డిస్కకర్షన్ వుంటుంది. టీం మీటింగ్స్ వుంటాయి. అంతేకాదు సినిమా పూర్తయిన వరకూ ప్రతి దశలో ఆయన జోక్యం వుంది. అయితే ఇలాంటి జోక్యాలు నచ్చని కొందరు దర్శకులు వుంటారు. దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా ఇలాంటి కోవకే వస్తారు. ఆయనది ప్రత్యేక శైలి. అయితే ‘థాంక్యూ’ సినిమా విషయంలో మాత్రం దిల్ రాజు తనకి నచ్చినట్లు వర్క్ చేయమని ఓపెన్ గా చెప్పారట. ఈ విషయాన్ని దిల్ రాజే వెల్లడించారు.
'' విక్రమ్ తీసిన హలోలో లవ్‌స్టోరీ బావుంటుంది. కానీ ఎక్కడో ఆడియన్‌కి రీచ్ కాలేదు. అలాగే గ్యాంగ్‌లీడర్ కూడా. అందులో వున్న లోటుపాట్లు గురించి విక్రమ్‌తో మాట్లాడాను. థాంక్యూ వందశాతం ఆడిటోరియానికి రీచ్ కావాలంటే నేను ఈ సినిమాతో జర్నీ చేస్తాను అని ఓపెన్‌గా చెప్పాను.
టీమ్ డిస్కషన్‌కి తనని ఒప్పించాను. కొన్నిసార్లు ఎక్కడో ఇబ్బందిపడ్డాడు. నచ్చజెప్పాను. షూటింగ్, ఎడిటింగ్ ప్రాసెస్‌లో ఇలాగే పనిచేశాం. ప్రతిచోటా టీమ్ వర్క్, హోమ్ వర్క్ లాగా చేశాం'' అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.