‘గ్యాంగ్‌లీడర్‌’ .. విక్రమ్ మ్యాజిక్ ఎక్కడ ?

మరిన్ని వార్తలు

దర్శకుడు విక్రమ్ కె.కుమార్‌ కి ప్రత్యేక అభిమాన గణం వుంది. 13 బి, మ‌నం, 24…. ఇలా ఒక క‌థ‌కీ మ‌రో క‌థ‌కీ లింకు లేకుండా సినిమాలు తీశాడు విక్రమ్ కుమార్‌. ఆయన సినిమా అంటే థ్రిల్. చాలా కాంప్లీకేట్ కథని, చాలా సింపుల్ గా, అంతకుమించి థ్రిల్లింగా చెప్పడం విక్రమ్ కుమార్ మార్క్. 'మనం' సినిమా తీసుకోండి. ఆ సినిమా కథ చెప్పాలంటే అంత తేలిక కాదు. చాలా కాంప్లీకేట్ గా ఉంటుంది. కానీ విక్రమ్ కుమార్ తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడు. 24 కూడా కూడా అంతే. టైంతో ఆడుకున్నాడు విక్రమ్.

 

ఇక '13 బి' అయితే సస్పెన్స్ థ్రిల్లర్స్ లో ఎవర్ గ్రీన్. ఇందతా విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే మ్యాజిక్. ఇప్పుడు నానితో ‘గ్యాంగ్‌ లీడర్’ తీస్తున్నాడు విక్రమ్. ఈ సినిమా టీజర్‌ వచ్చింది. ‘నా పేరు పెన్సిల్‌. ఫేమస్‌ రివెంజ్‌ రైటర్‌’ అంటూ నాని టీజర్‌ లో సందడి చేశాడు. ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ లోనే చెప్పేశారు. ఓ అయిదుగురు మహిళలు (పాప నుండి ముసలమ్మ వరకూ అన్ని ఏజ్ గ్రూపులు) నానికి పరిచయం అవుతారు. ఒకరిపై రివేంజ్ తీర్చుకోవడానికి. ఆ రివెంజ్ ఏమిటనేదే కథ. పాయింట్ కొత్తగానే వుంది.

 

ఐదుగురు మహిళలు గ్యాంగ్ గా ఏర్పడి హీరో దగ్గరికి వెళ్లడం అన్నది కొత్త పాయింటే. ఐతే టీజర్ లో విక్రమ్ కుమార్ మెరుపులు కనిపించలేదు. నాని సినిమాలాగే వుంది కానీ విక్రమ్ కుమార్ మ్యాజిక్ తో ఒక్క సీన్ లేకపోవడం ఆయన స్క్రీన్ ప్లే ని అభిమానించేవారికి నిరాశ పరిచింది. ప్రేక్షుకుల మెదడుకు పదునుపెట్టెలా ఉంటాయి విక్రమ్ కుమార్ సీన్లు. ఐతే గ్యాంగ్ లీడర్ లో అంతలా ఆలోచింప చేసిన సీన్ ఒక్కటీ లేదు. విక్రమ్ స్క్రీన్ ప్లేని విపరీతంగా అభిమానించే ఫాన్స్ కి ‘గ్యాంగ్‌లీడర్‌’ టీజర్ అంత కిక్ ఇవ్వలేదనే చెప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS